శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న కలెక్టర్ డా. మనజీర్

శ్రీశైలం /నంద్యాల, ఫిబ్రవరి 18:-మహాశివరాత్రి సందర్భంగా  మల్లన్న  దర్శనార్థం  వచ్చిన  భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులకు  కలెక్టర్ సూచించారు. శనివారం గంగాధర మండపం వద్ద నుండి జిల్లా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ తో పాటు జిల్లా ఎస్‌.పి. రఘవీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నలతో కలిసి నడుచుకుంటూ శ్రీ కృష్ణదేవరాయ గోపురం వద్ద మెడికల్ క్యాంపును సందర్శించి వైద్యసిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యూలైన్లలోని భక్తులతో కలెక్టర్ సంభాషిస్తూ ఏర్పాట్లపై ఆరా తీయగా క్యూలైన్లలో కొన్నిచోట్ల మంచినీటి సరఫరా కొరత ఉన్నట్లుగా భక్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, యుద్దప్రాతిపదికన క్యూలైన్లలో మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం, బ్రహ్మానందరాయ గోపురం వద్ద భక్తుల కోసం చేసిన క్యూలైన్లను కూడా పరిశీలిస్తూ భక్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను సూచించారు.

పాగాలంకరణ, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి  ఏర్పాట్లను కూడా  పరిశీలించి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డిలకు తగు సూచనలను జారీ చేశారు.

print

Post Comment

You May Have Missed