స్పొర్ట్స్ మరియు యువజన శాఖ లను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చిన నేపద్యం లో 31 జిల్లాల లో వున్న జిల్లా క్రీడా యువజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి పద్మా రావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో పరిపాలన సౌలభ్యం కొరకు క్రొత్త జిల్లా లు ఏర్పడిన నేపద్యం లో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అన్నీ శాఖ ల మాదిరిగానే క్రీడా యువజన శాఖ కూడా ప్రజలకు చేరువ లో వుండాలని అధికారు లకు పలు సూచనలు తెలిపారు.
క్రీడల, యువజ సంక్షేమ శాఖ అధికారులు ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ లో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను జిల్లా లో ని క్రింది స్థాయి వరకు చేరే లా పలు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లా లో శాఖ పరంగా ఏవైనా ఇబ్బందులు వుంటే కలెక్టర్ల ద్వారా వెంటనే తమ దృష్టి కి తీసుకురావాలని కోరారు. క్రీడాకారులకు, యువత కు అందుబాటు లో వుంటూ పారదర్శకంగా పని చేస్తూ గ్రామీణ స్థాయి లూ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీస్తూ తమ వంతు భాద్యత నిర్వహించాలని అన్నారు.
గౌరవ ముఖ్య మంత్రి గారితో మాట్లాడి క్రీడా, యువజన శాఖ నిధులు పెంచడానికి, శాఖ బలోపేతానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. ప్రభుత్వ పథకాలను క్రింది స్థాయి కి తీసుకెళ్లడానికి ఉద్యోగులు, సిబ్బంది సమిష్టి గా కృషి చేయాలని వారు కోరారు.
జనవరి, 12 నా హర్యానా లో జరిగే యూత్ మేళ కు వెళ్ళే ప్రతినిధి బృందం గురించి, మరియు ఖేలో ఇండియా కు ప్రతిపాదికలు సిద్దం చేయాలని మంత్రి అధికారులని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం లో స్పొర్ట్స్ ఛైర్మన్ శ్రీ. వెంకటేశ్వర్ రెడ్డి, సెక్రెటరీ శ్రీ. బి. వెంకటేశం గౌడ్, స్పొర్ట్స్ MD శ్రీ. దినకర్ బాబు, యువజన శాఖ ఎండి శ్రీ. మహమ్మద్ అబ్దుల్ అజీమ్, ప్రభుత్వ సలహారుడు శ్రీ. పాప రావు, OSD శ్రీ. ఎస్.ఎం. రాజేశ్వర్ రావు తదితరులు పాల్గోన్నారు.
ఈ సమావేశం తెలంగాణ సచివాలయం లోని డి బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సుమారు మూడు గంటల పాటు సుధీర్గంగా జరిగింది.