హైదరాబాద్ లో డిసెంబర్ 15వ తేది నుంచి 18వ తేది వరకు జరుగు 77వ IRC వార్షికసమావేశముల గురించి సంక్షిప్త వివరణ:
ఇండియన్ రోడ్ కాంగ్రెస్:
1927 వ సంవత్సరంలో అప్పటి భారత ప్రభుత్వం శ్రీ M.R. Jaya Shankar నేతృత్వంలో రహదారుల అబివృద్ధి సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ యొక్క ఉద్దేశం దేశంలో రహదారుల ఇంజినీర్లు మరియు నిపుణులకు రహదారుల నిర్మాణంలో మరియు నిర్వహణలో దిశానిర్దేశం చేయటం.
ఆ సంస్థ సమావేశంలో రహదారుల ఇంజినీర్లు మరియు వృత్తి నిపుణులతో ప్రతి సంవత్సరం వార్షిక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ విధంగా మొదటి “IRC” మీటింగ్ 1934 సంII లో నిర్వహించారు. కాలక్రమంలో IRC సంస్థను ఒక సొసైటీగా రిజిస్టర్ చేయించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మొదట్లో IRC సభ్యత్యం 73 మందితో మొదలై ప్రస్తుతం 16,700 వరకు విస్తరించింది.
ఇంజినీర్లకు మరియు వృత్తి నిపుణులకు రహదారుల నిర్మాణంలో ఈ IRC సమావేశాలు తగిన మార్గనిర్దేశం చేస్తాయి. నూతన నిర్మాణ పద్దతులు, పర్యావరణ సంబంధిత విషయాలు, రహదారి భద్రత, ప్రమాద నివారణలు తదితర అంశాలపై మేథోమథనం జరుగుతుంది. నాణ్యత ప్రమాణాల మరియు ఇతర సాంకేతిక అంశాలపై విషయ పరిజ్ఞాన మార్పిడి జరుగుతుంది. ఈ చర్చలు వృతినిపుణులకు రహదారుల నిర్మాణంలో చాలా ఉపయోగపడుతాయి.
అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ సమావేశాలు మన రాష్ట్రంలో ఇంజినీర్లకు, కాంట్రాక్టర్లకు మరియు వృత్తి నిపుణులకు తమ పరిజ్ఞానం పెంచుకోవటంలో తద్వారా ఉత్తమ రహదార్ల నిర్మాణంలోను ఎంతో ఉపయోగ కరంగా ఉంటాయి.
IRC సమావేశంలో రహదార్ల నిర్మాణానికి, నిర్వహణ ప్రమాణాలను నిర్దేశించటం, సాంకేతిక మెలకువలను మెరుగు పరచటం, నిర్మాణ పద్ధతులను, మరియు నూతన యంత్రాల వినియోగం , పర్యావరణ హితమైన నిర్మాణం, పర్యావరణ హితమైన పదార్థాల వినయోగం, రహదారుల భద్రత, ప్రమాద నివారణ వంటి అంశాలపై నిపుణులు చర్చించి మార్గసూచిక చేయటం జరుగుతుంది.
ఈ సమావేశంలో ఫలాలు మెరుగైన రహదార్ల నిర్మాణానికి మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు ఎంతో సహకరిస్తాయి. నూతనంగా ఏర్పడిన మన రాష్ట్రానికి ఈ 77వ IRC సమావేశాల వల్ల చాలామేలు జరుగుతుంది.
- పర్యావరణ హితమైన నిర్మాణం మరియు నిర్వహణ.
- ఇంధన పరిమిత వినియోగం
- కార్బన్ ఉద్గారాలపై తగు నియంత్రణ.
- నూతన నిర్మాణ పద్దతులు
- రీసైక్లింగ్ పద్దతులు
- సహజ వనరుల వినయోగం పై నియంత్రణ
- ఇంటిగ్రటెడ్ రావాణ వవ్యస్త
- ప్రమాద రహిత ప్రయణం
జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ IRC సమావేశాలను మన తెలంగాణా ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ప్రియతమ ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో మన రాష్ట్రానికి మరో 2600 కి.మి నిడివి గల నూతన జాతీయ రహదారులు మంజూరు అయ్యయి. ఇప్పటి వరకు ఉన్న 2600 కి.మి ల కు ఇవి అదనం. అంతేకాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకoగా రాష్ట్ర రహదారులు మరియు వంతెనల విస్తరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. షుమారు రూII 13,380 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 12790 కి.మి నిడివిగల రహదారులను రెండు/ నాలుగు వరసలుగా అభివృధి చేయటానికి ప్రణాళికలు మంజూరు చేసింది. రాష్ట్రం తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ఈ 77వ వార్షిక IRC సమావేశాలు మన రాష్ట్రానికి, రహదార్ల నిర్మాణ మరుయు నిర్వహణ వ్యవస్థకు మెరుగైన జీవన ప్రమాణాలకు ఎంతో ఉపయోగపడుతాయి.
ఈ IRC సమావేశాలు రాష్ట్రానికి మరియు రహదారులు మరియు భవనములశాఖ పనితీరుకు తలమానికం కాగలదు.
IRC విశిష్టత
- 1934 వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదిన స్థాపించబడెను.
- 73 మంది సభ్యులతో స్థాపించబడి ప్రస్తుతం 16,700 మంది సభ్యులతో కొనసాగుతూ పలు ఇంజినీర్లు,ఉద్యోగులు మరియు రహదారుల సంబంధితఉద్యోగులు కలిసి ఐదు మిలియన్ మందికి పైగాసహచరులు (ప్రత్యక్ష/పరోక్ష ) కలిగియున్నది.
- IRC,రోడ్లు మరియు వంతెనల నిర్మాణముల విషయంలోను జాతీయ ప్రామాణిక నిర్దిష్టతను కలిగియున్నది.
- ప్రమాదరహిత రోడ్ల నిర్మాణములలో సహకరిస్తూ దేశ ఆర్థిక పెరుగుదలకు, నాణ్యత గల జీవన విధానమునకు తోడ్పడుచున్నది.
- ఇంటెగ్రేటెడ్ రవాణా వ్యవస్థకు పర్యావరణ సమతుల్యత కలిగి సురక్షిత గమ్యస్థానము చేరుటకు సకరించుచున్నది.
- ట్రాఫిక్ నిబంధనలుగురించి ప్రత్యక్షమైన అవగాహనకుకృషి చేయుచున్నది
IRCవార్షిక సమావేశములు:
IRC వార్షిక సమావేశములు ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు దేశంయొక్క ప్రముఖ నగరాలలో జరుపబడును, అందులో జాతీయ రహదారుల ఇంజినీర్లు,పరిశోధన శాస్రవేత్తలు, కన్సల్టెంట్లు మరియు ఇతర ప్రొఫెషనల్స్ సమావేశమై రహదారుల గురించి సాంకేతిక మరియు విధాన సమస్యల గురించి నిర్ణయంలు తీసుకుoదురు. ఇప్పటి వరకు 76 సమావేశములు వివిధ నగరాలో జరిగినవి. గతంలో హైదరాబాద్ నగరంలో రెండు సార్లుIRC వార్షికసమావేశములు జరుపబడినవి. ఇటీవల 1998వ సంవత్సరంలో పబ్లిక్ గార్డెన్స్ లో IRC సమావేశములు జరుపబడినవి. గత సంవత్సరం (76వ IRC) సమావేశములు మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని Indore నందు జరిగినవి.హైదరాబాద్ నగరము నందుIRC77వ వార్షిక సమావేశములు:· IRC సెక్రెటరీజనరల్ గారు, తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించి IRC 77వ వార్షిక సమావేశములను హైదరాబాద్ లోజరుపుటకు(ఆతిధ్యం వహించుటకు) అంగీకారం జరిపినారు.· IRC అధికారికంగా 77వ వార్షిక సమావేశములు15వ తేదీ డిసెంబర్ నుండి 18 వ తేదీ డిసెంబర్ వరకు హైదరాబాద్ లో జరుపుటకుఅంగీకారం జరిగినది.· గౌరనీయులైన కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కారీ గారు, డిసెంబర్ 16న జరుగు మెగా ఈవెంట్ ప్రాంరంభొత్సవాని కి మరియు ఫ్రారంభ సమావేశం గురుంచి గౌరవ అతిధిగా శ్రీ గౌIIకల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు.· 77వ IRCసమావేశములు గురించి ప్రభుత్వ ఉత్తర్వులు ఆర్.టి.నెం.404, తేదీ 12.08.2016 ప్రకారం ప్రభుత్య ముఖ్యకార్యదర్శి గారు రాష్ట్ర సలహా కమిటీ ఛైర్మన్ గాను మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ (ర&భ) శాఖ గారిని స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గాను నియమించుట జరిగినది.· 77వ ఐఆర్సి సమావేశములు సజావుగా జరుగుటకు 11 మంది (ర&భ) శాఖ పర్యవేక్షక ఇంగినీర్స్ ని అధ్యక్షలు గా గల 11 కమిటీ లు యేర్పాటు చేయుట జరిగినది.· ప్రభుత్వం, ఈ సందర్భం గా HITEX,హైదరాబాద్ ని IRC 77 వవార్షిక సమావేశములు జరుపుటకు వేదికగా వుత్తరవులు ఇచ్చినారు.· ఈ సందర్భం గా 2500 నుంచి 3000 మంది వివిధ రంగముల నిపుణత కలిగిన ప్రతినిధులు హాజరు కాగలరని భావించు చున్నారు.· కొత్తగా యేర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ అవకాశం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పరంగా రహదారులు మరియు వంతెన నిర్మాణం లోని విన్నూతన పర్యావరణహిత technologies ను చర్చించుటకు మరియు తెలంగాణ రాష్ట్రంలోని రహదారుల వ్యవస్థ సామర్ధ్యం ను బహిర్గత పరచుటే గాకుండా ఈ అవకాశం రహదారుల నిర్మాణములో కొత్త ఆవిష్కరణలు కలుగచేయటకు దోహద పడును.