×

CNN- సర్కార్ దవాఖాన లో చనిపోయిన వాళ్ళను ఉచితంగా వారి ఇళ్లకు తరలింపు హర్సే పేరిట పరమపద వాహనాలు 50 వాహనాలు సేవలకు సిద్ధం జిల్లాల వారీగా హాస్పిటల్స్ కు కేటాయింపు 18న గాంధీ దవాఖానలో ప్రారంభించనున్న మంత్రి లక్ష్మారెడ్డి

CNN- సర్కార్ దవాఖాన లో చనిపోయిన వాళ్ళను ఉచితంగా వారి ఇళ్లకు తరలింపు హర్సే పేరిట పరమపద వాహనాలు 50 వాహనాలు సేవలకు సిద్ధం జిల్లాల వారీగా హాస్పిటల్స్ కు కేటాయింపు 18న గాంధీ దవాఖానలో ప్రారంభించనున్న మంత్రి లక్ష్మారెడ్డి

సర్కార్ దవాఖాన లో చనిపోయిన వాళ్ళను ఉచితంగా వారి ఇళ్లకు తరలింపు

హర్సే పేరిట పరమపద వాహనాలు

50 వాహనాలు సేవలకు సిద్ధం

జిల్లాల వారీగా హాస్పిటల్స్ కు కేటాయింపు

18న
గాంధీ దవాఖానలో ప్రారంభించనున్న మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ :
అయినోళ్లు అందుబాటులో లేక అనుకోని విధంగా వేరేచోట  క‌న్నుమూస్తే…. సొంతూరుకి తీసుకెళ్లే త‌హాతు లేక మృత దేహాలను భుజాల‌పై మోసుకోనిపోవ‌డం..తోపుడు బండ్ల‌పై నెట్టుకుపోవ‌డం, ఆర్టీసీ బ‌స్ లో భార్య శవంతో ప్ర‌యాణించ‌డం లాంటి ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా చోటుచేసుకున్నాయి. కానీ ఇంతకు ముందే ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుగొన్నది తెలంగాణ సర్కార్. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పుడు ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చింది ఇటువంటి ఘ‌ట‌న‌ల‌పై మానవతా దృక్పథంతో స్పందించింది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం. అర్ధాంత‌రంగా ఊరుకాని ఊరిలో చికిత్సపొందుతూ,  చ‌నిపోయిన వారిని వాళ్ళ  సొంతూరికి చేర్చేందుకు కొత్త‌గా హెర్సే (హెర్స్ అంటే పాడే) పరమపద వాహనాల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తోంది తెలంగాణ సర్కార్. ఇది రాష్ట్రంలో మొదటిది.

త‌మ‌ది మాన‌వ‌త్వ‌మున్న స‌ర్కారు అని మ‌రోమారు రుజువు చేసుకుంటోంది కేసీఆర్ ప్ర‌భుత్వం. అనుకోని రోగాలు, అనూహ్య మరణాలు సంభవిస్తున్న కాలమిది. రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ దశలో వైద్యం పేదలకు సవాల్ గా మారుతున్నది. ఉన్న ఊరు, కన్న వాళ్ళను వదలి, వైద్యం కోసం పల్లెల నుంచి పట్టణాలకు పోవలసి వస్తున్నది. అకాల మృత్యువు, చికిత్స పొందుతుండగా మరణం సంభవిస్తే, నిరుపేదలు తమ వాళ్ళ శవాలను ఇళ్లకు తీసుకెళ్లడం కూడా సమస్యగా పరిణఁమిస్తున్నది. చేతిలో చిల్లి గవ్వ లేక, బిక్కు బిక్కు మంటూ, శవాలని తీసుకెళ్లడానికి నరక యాతన పడుతున్న వాళ్ళను చూస్తున్నాం. అలంటి వాళ్ళని ఆదుకోవాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. అలాంటి వాళ్ళ కోసం కొత్త‌గా హెర్సే పేరుతో  యాభై వాహానాల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది కేసీఆర్ ప్ర‌భుత్వం. ఈ హెర్సే  వెహికిల్స్ ని పేరుతో శుక్ర‌వారం నుంచి ప్రారంభించ‌నున్నారు. గాంధీ వైద్యశాలలో వీటిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి 18 వ తేదీన ప్రారంభించ‌నున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ,  డీప్యూటీ సీఎం మహమూద్ అలీ మంత్రులు నాయిని తలసాని, పద్మారావు తదితరులు హాజరవుతున్నారు.

తొలుత 50 వాహానాల‌ను అందుబాటులో ఉంచ‌బోతున్నారు. రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌భుత్వ వైద్య శాలల్లో వీటిని ఉంచ‌బోతున్నారు. గాంధీ దవాఖానకి 10 వాహ‌నాలు, ఉస్మానియాకు 10, నిమ్స్ కు రెండు, ఆరు  ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల‌కు 6, పాల‌మూరు కు రెండు, వ‌రంగ‌ల్ ఎంజీఎం కు మూడు, ఆదిలాబాద్ రిమ్స్ కు రెండు, భ‌ద్రాచ‌లానికి ఒక‌టి, నిజామాబాద్ కు రెండు, మంచిర్యాల‌కు ఒక‌టి, గ‌జ్వేల్ కు ఒక్క వాహానాన్ని కేటాయిస్తున్నారు. ఇంకా మిగిలిన  ప‌ది వాహ‌నాల‌ను వెసులుబాటును బ‌ట్టి వాడ‌నున్నారు.

కాగా ఈ హెర్సే వాహ‌నాలు రెండు ర‌కాలుగా ఉంటాయి. ఒక దాంట్లో రెండు శ‌వాల‌ను ఒకేసారి తీసుకెళ్లేలా రెండు ఫ్రీజ‌ర్స్ తో త‌యారు చేసిన వాహ‌నాలు, ఒక శవాన్ని మాత్ర‌మే తీసుకెళ్లే ఒకే ఫ్రీజ‌ర్ గ‌ల వాహ‌నం. మ్రుత దేహం డీ కంపోజ్ కాకుండా ముందస్తు జాగ్ర‌త్త‌గా ఈ ఫ్రీజ‌ర్ స‌దుపాయాన్ని క‌ల్పించారు. ఇవి 24 గంట‌లు అందుబాటులో ఉంటాయి. అవ‌స‌ర‌మైన వారు 108కి ఫోన్ చేసి వీటిని తెప్పించుకోవ‌చ్చు. వీటిని 108 వాహ‌నాల‌ను మెయింటెన్స్ చేసే జీవీకే గ్రూపే వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త తీసుకుంది. దీని సేవ‌లు ఉచితం. మృత దేహా లను తీసుకెళ్లినందుకు ఎటువంటి చార్జీలు వ‌సూలు చేయ‌రు.

ఇక హాస్పిటల్స్ లో అయిన‌వారు చ‌నిపోతే సొంతూరికి తీసుకెళ్లాలంటే చాలాసార్లు వాహ‌న‌దారులు శ‌వాల‌ను తీసుకుపోవ‌డానికి ముందుకు రారు. పేద‌వాడు వైద్య శాలలో చ‌నిపోయి… సొంతూరుకు తీసుకెళ్లాలంటే ఇప్ప‌టిదాకా ఉన్న ఇబ్బందులు ఇక ఉండ‌వ‌నే చెప్ప‌వ‌చ్చు.

<
>
print

Post Comment

You May Have Missed