లండన్ లో తెలంగాణ రాష్ట్ర టూరిజం,గిరిజనాభివృద్ధి మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ కి ఘనస్వాగతం
లండన్ :- తెలంగాణ రాష్ట్ర టూరిజం,గిరిజనాభివృద్ధి మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ కి ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.జై తెలంగాణ జై కెసిఆర్ నినాదాలతో లండన్ హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయం మారుమోగింది.లండన్ లో నిర్వహిస్తున్న ‘వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్ 2016’ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి చందూలాల్, టూరిజం సెక్రటరీ బూర వెంకటేశం వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ సదస్సులో 182 దేశాల నుండి యాబై వేలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారు.అలాగే తెలంగాణా ఎన్నారై లు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రభుత్వ పథకాలు మరియు బంగారు తెలంగాణ సాధనకు ఎన్నారైల తోడ్పాటు తదితర అంశాలపై చర్చిస్తారు. లండన్ లో టూరిజం మంత్రికి స్వాగతం తెలిపిన వారిలో ఎన్నారై టీఅర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శులు నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి,యూకే ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,లండన్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల,సభ్యులు సతీష్ రెడ్డి బండ,సృజన్ రెడ్డి ,సత్యపాల్ ,సత్యం రెడ్డి కంది,మల్లా రెడ్డి,రాజేష్ వర్మ ,రాకేష్ ,సత్య చిలుముల,రవి ప్రదీప్ ,టిడియఫ్ ప్రతినిధులు మరియు జాగృతి ప్రతినిధులు హాజరైన వారిలో వున్నారు.