రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్-2016ను ప్రారంభించిన గౌరవ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నాయిని నర్సింహ్మరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి, స్థానిక ప్రతినిధులు, అధికారులు.
ఇన్ స్పైర్ కార్యక్రమంలో లో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ పరికరాల గురించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్న గౌరవ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి.
పాఠశాలల్లో కనీస వసతులకు ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. నియోజక వర్గానికి ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తోంది. గత ప్రభుత్వాలు గాడి తప్పించిన తెలంగాణ విద్యా వ్యవస్థను వచ్చే నాలుగైదేళ్లలో తిరిగి గాడిలో పెడుతాం.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గురుకులాలను మంజూరు చేస్తున్నారు.
ఈ రెండేళ్లలోగౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ 464 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారు. గురుకులానికి 20 కోట్ల రూపాయల చొప్పున కనీసం పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుంది. కనీసం 10 నుంచి 15వేల మంది ఉపాధ్యాయుల నియామకం జరుగుతుంది.
డిఎస్సీ వేయాలని ఇప్పటికే నిర్ణయించినా జిల్లాల పునర్వవస్థీకరణ వల్ల ఆలస్యమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనల మేరకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. వీటిని టిఎస్సీపీఎస్సీ ద్వారా భర్తీ చేసి 2017 జూన్ నాటికి పోస్టింగ్ లు కూడా ఇస్తాం.
హైదరాబాద్ జిల్లాకు త్వరలో 15 నియోజక వర్గాల కోసం 75 కోట్ల రూపాయలను పాఠశాలల్లో మౌలిక వసతులకు విడుదల చేస్తాం.
జూనియర్, డిగ్రీ కాలేజీల్లో, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులైజేషన్ త్వరలోనే పూర్తవుతుంది. న్యాయపర ఇబ్బందుల వల్ల ఆలస్యమైంది..వాటిని అధిగమించి రెగ్యులరైజ్ చేస్తాం.
ఫీజు రియింబర్స్ మెంట్ పై మాట్లాడుతున్న పెద్దలు..వారే ఈ బకాయిలకు కారణమన్నసంగతి మర్చిపోతున్నారు. వాటిని ఇప్పుడు మేం క్లియర్ చేస్తున్నాం.
బాలల దినోత్సవం నవంబర్ 14వ తేదీన 1500 పాఠశాలల్లో మొదటి దశ డిజిటల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్నాం. దశలవారిగా అన్ని స్కూళ్లలో వీటిని ప్రారంభిస్తాం. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తాం.
తల్లిదండ్రులంతా ప్రభుత్వ పాఠశాలల వైపు చూసే విధంగా ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాలయాలుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.
ఇన్ స్పైర్ కార్యక్రమంలోలో విద్యార్థులు ఏర్పాటు చేసిన కాన్సెప్ట్ లను కంపెనీలకు ఇచ్చి కొత్త పరికరాలు అభివ్రుద్ది చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల మేథస్సును కాపాడే విధంగా పేటేంట్ హక్కు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం.
మంత్రులకు ఇచ్చే మెమోంటోలను ఎగ్జిబిషన్ లో ఉత్తమ పరికరాలు ప్రదర్శించిన విద్యార్తులకు అందించాలని గౌరవ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పాఠశాల సిబ్బందికి సూచించారు.
గతంలో ఇన్ స్పైర్ ద్వారా జపాన్ సైన్స్ ఫెయిర్ కు వెళ్లిన విద్యార్థులను, ఉపాధ్యాయులను గౌరవ డిప్యూటీ సిఎం శ్రీహరి అభినందించారు.