CNN- రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వివిధ పధకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించేందుకు క్షేత్ర స్థాయి లో అధికారులు కృషి చేయాలనీ రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వివిధ పధకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించేందుకు క్షేత్ర స్థాయి లో అధికారులు కృషి చేయాలనీ రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాంపల్లి లోని ఉద్యాన శాఖ శిక్షణ కేంద్రం లో జాతీయ నూనెగింజల మరియు ఆయిల్ పామ్ మిషన్ పధకం కింద యాసంగి వేరుశనగ అధిక దిగుబడి సాధన పై జిల్లా వ్యవసాయ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పడ్డాక ప్రతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల పరిధిలో భూమి విస్తీర్ణం తగింది కాబట్టి ప్రతి రైతు పై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలలో పని చేసే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ సిబ్బంది 2533, 235 వ్యవసాయ సాంకేతిక సిబ్బంది జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని రైతులకు అందుబాటులో ఉండే విధంగా జిల్లా అధికారులు బాధ్యత వహించాలని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామం లో రైతుల పూర్తి స్థాయి వివరాలను సేకరించాలని ఈ వివరాలను ఆన్ లైన్ వెబ్ పోర్టల్ లో పొందు పరచాలని తెలిపారు. జిల్లా లో మంచి ఫలితాలు సాధించడానికి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి సూచించారు. త్వరలో 24 మార్కెట్ యార్డ్ ఆవరణ లో భూ సారా పరీక్షా ల్యాబ్ లు ఏర్పాటు చేసిన తరవాత పట్టెడర్ ప్రకారం భూ సారా పరీక్షా చేయాలనీ తెలిపారు. రైతులు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా అధికంగా నష్ట పోకుండా వ్యవసాయ అధికారులు పంట ప్రణాళిక పై అవగాహన కలిపించాలన్నారు. మార్చి 31, 2017 లోపు పూర్తి స్థాయి లో పంట కోత జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతు పంట భీమా చేసేవిధంగా క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రైతుల పొలాలలో పురుగు గమనించిన అనంతరం వ్యవసాయ అధికారులు పరిశీలించి పురుగు మందుల సంతకం చేసిన సిఫార్సు పత్రం ద్వారా నే షాప్ ఓనర్ పురుగు మందులు ఇవ్వాలని జిల్లా అధికారులు డీలర్లకు, రైతులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సీడ్ ఫార్మ్స్ గా గుర్తించిన జిల్లాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని రబి లో సీడ్ ఫార్మ్స్ ను పూర్తి స్థాయి లో ఉపయోగించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీ నుండి పాత జిల్లా ను జోన్ గా పరిగణించి వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లా లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, రైతులు ఈ కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులను  విక్రయించేలా అవగాహనా పరచాలని మంత్రి సూచించారు. రైతు భిందు పధకం ద్వారా పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఆర్ధిక సహాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారధి మాట్లాడుతూ వేరుశనగ దిగుబడి అధికంగా సాధించేందుకు ఒక హెక్టార్ కు అధిక సంఖ్య లో మొక్కలు నాటాలని, జిప్సం వాడకం, సూక్ష్మ సేద్యం లో స్ప్రింక్లర్ పద్దతి వాడటం పాటించాలన్నారు. రైతుల అవసరాలను  క్షేత్ర స్థాయి లో సిబ్బంది గుర్తించాలన్నారు. మండల స్థాయి లో వ్యవసాయ అధికారి విత్తన, ఎరువుల కంపెనీ డీలర్లతో స్టాక్ వివరాలను సేకరించి విత్తన, ఎరువుల పంపిణి లో సమస్యలకు తావు లేకుండా దృష్టి పెట్టాలన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ ఏం జగన్ మోహన్ మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా వ్యవహరించి, క్షేత్ర స్థాయి లో రైతులకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం యాసంగి వేరుశనగ సాగు యాజమాన్య పద్ధతుల పై సమాచార కరపత్రాలను విడుదల చేసారు.

ఈ సమావేశం లో హకా ఏం డి ఏం. సురేందర్, విత్తనాల పరిశోధన సంచాలకులు కొల్హర్కర్ తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.