రాష్ట్రంలో క్రొత్త జిల్లాలు ఏర్పడిన నేపధ్యంలో పథకాల పర్యవేక్షణ సులువైనప్పటికి, అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పెరిగాయని, ముఖ్యంగా క్రొత్త జిల్లాల అధికారులకు మార్గదర్శనo చేయవలసిన అవసరం ఉందని, ఈ పరిస్థితులలో ఓరియేoటేషన్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం ఒక మంచి భావన అని రాష్ట్ర సలహాదారు (సంక్షేమం) శ్రీ రామలక్ష్మణ్ అన్నారు. అయన ఈ శుక్రవారం రోజున డా. మర్రి చెన్నారెడ్డి మనవ వనరుల అభివృద్ధి సంస్థ లో షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ రాష్ట్రంలోని జిల్లా అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, పర్యవేక్షకులు, ఎస్.సి. కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, సహాయ ఎగ్జిక్యూటివ్ అధికారులకు ఏర్పాటు చేసిన 2 రోజుల ఓరియేoటేషన్ ప్రోగ్రాంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అధికారులు లబ్దిదారులకు చేరువగా వుండి పద్దతి ప్రకారం సునిశితంగా మానిటర్ చేసి లబ్ది చేకుర్చుతారని, జిల్లాల పరిధి తక్కువ కావున ప్రతి లాభోక్తున్ని గమనించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.సి. అభివృద్ధి శాఖ సెక్రటరి శ్రీ బెనహర్ మహేష్ దత్ ఎక్కా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు సంక్షేమం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, దానిలో భాగంగానే సంక్షేమ పథకాలు ప్రతి అర్హునికి అందచేయాలనే ఉద్దేశ్యంతో క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మరింత వేగంగా పథకాల అమలుకు గాను ఈ ఓరియేoటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎస్.సి. అభివృద్ధి శాఖ అధికారులు, మానిటరింగ్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మరింత వేగంగా పనిచేయాలని సూచించారు.
తెలంగాణా రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఎస్.సి. అభివృద్ధి అధికారులు తరచుగా ఎస్.సి. హాస్టళ్ళను సందర్శించి, ఎస్.సి. పిల్లలు ఏమి చేస్తున్నది, ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు వారికి వివరించి మార్గ దర్శనం చేయాలని అన్నారు. హస్టల్లలో చదివే విద్యార్థులను తమ స్వంత పిల్లల వలే చూడాలని, వారి అభివృద్దికి పాటుపడాలని కోరారు.
ఎస్.సి. అభివుద్ది శాఖ డైరెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) శ్రీ పి. కరుణాకర్ మాట్లాడుతూ, ఎస్.సి. అభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బందికి ఈ ఓరియేoటేషన్ ప్రోగ్రాం శాఖ కార్యక్రమాలపై ఒక అవగాహన కల్పిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు జిల్లా కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లతో సమన్వయము చేసుకుని మరింత చురుకుగా పనిచేసి ఎస్.సి. కమ్యునిటీ అభివృద్ధికి పాటుపడాలని ఉద్భోదించారు. ఈ సందర్భంగా ఎస్.సి. సంక్షేమ శాఖ ద్వారా చేపట్టి అమలుపరుస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.సి. కార్పోరేషన్ ఇంచార్జ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి. ఆనంద్ కుమార్, ఎస్.సి. అభివుద్ది శాఖ జాయింట్ డైరెక్టర్లు ఉమా దేవి, సురేష్ రెడ్డి, డిప్యూటి డైరెక్టర్లు అనురాధ, శ్రీనివాస రెడ్డి, హన్మంత్ నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.