రాష్ట్రంలో క్రొత్త జిల్లాలు ఏర్పడిన నేపధ్యంలో పథకాల పర్యవేక్షణ సులువైనప్పటికి, అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పెరిగాయని, క్రొత్త జిల్లాల అధికారులు బాధ్యతతో పనిచేసి అంబేడ్కర్ ఆశయాలతో ముఖ్యమంత్రి కలను సాకారం చేయాలని రాష్ట్ర ఎస్.సి. కార్పోరేషన్ చైర్మెన్ డా. పిడమర్తి రవి అన్నారు. ఆయన శనివారం రోజున డా. మర్రి చెన్నారెడ్డి మనవ వనరుల అభివృద్ధి సంస్థ లో షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ రాష్ట్రంలోని జిల్లా అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, పర్యవేక్షకులు, ఎస్.సి. కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, సహాయ ఎగ్జిక్యూటివ్ అధికారులకు ఏర్పాటు చేసిన 2 రోజుల ఓరియేoటేషన్ ప్రోగ్రాంలో ముగింపు సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఎస్.సి. అభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యంగా క్రొత్త జిల్లాల అధికారులకు ఈ ఓరియేoటేషన్ ప్రోగ్రాం ఒక దిక్శూచి లాగా పని చేస్తుందని అన్నారు. ఈ ప్రోగ్రాం స్పూర్తితో ఎస్.సి. అభివృద్ధి శాఖ మరియు ఎస్.సి. కార్పోరేషన్ రెండు విభాగాల లక్ష్యం ఒకటే కావున అందరు అధికారులు ఎస్.సి. కుటుంబాలు మరియు ఎస్.సి. పిల్లల పై దృష్టి ఉంచి వారికి ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. భూమి లేని నిరుపేద దళిత రైతులకు ప్రభుత్వం పంపిణి చేసిన భూమిలో దాదాపు అందరు రైతులు భూమి సాగు చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. అధికారులు కేవలం అంకితభావంతో పనిచేయడం మాత్రమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తగిన ప్రచారం ఇచ్చి ప్రజల్లోకి తిసుకేళ్లలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.సి. అభివృద్ధి శాఖ సెక్రటరి శ్రీ బెనహర్ మహేష్ దత్ ఎక్కా మాట్లాడుతూ, ఈ రెండు రోజుల ఓరియేoటేషన్ ప్రోగ్రాంలో సాధ్యమైనంత నేర్చుకోన్నారని భావిస్తున్నాని, ఈ ప్రోగ్రాం ద్వారా మీలో నూతన ఉత్సాహం నింపిందని, అదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా పనిచేయాలని, జిల్లా అధికారులు ముఖ్యంగా క్రొత్త జిల్లాల అధికారులు వారి యొక్క విధులను ప్రభుత్వ ఆశయాల కనుగుణంగా ముందుకు సాగాలని అన్నారు. ఇంతకు పూర్వం జిల్లా విస్తిర్ణo ఎక్కువగా ఉండేదని ఇపుడు క్రొత్త జిల్లాల ఏర్పాటుతో పరిధి తగ్గి ఒక్క్కొక్క అధికారికి సుమారు 20-30 హాస్టళ్ళు మాత్రమే ఉంటాయని కావున ప్రతి హాస్టల్ ను బాగుగా సందర్శించి హాస్టల అధికారులకు సూచనలు ఇచ్చి విద్యార్థుల ఉత్తిర్నత మెరుగయ్యేలా చేయాలనీ ఆదేశించారు. ఇటువంటి ఓరియేoటేషన్ ప్రోగ్రాంలు తరచుగా నిర్వహించాలని డైరెక్టర్ ను కోరారు.
ఎస్.సి. అభివుద్ది శాఖ డైరెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) శ్రీ పి. కరుణాకర్ మాట్లాడుతూ, ఎస్.సి. కార్పోరేషన్ చైర్మెన్ మరియు ఎస్.సి. అభివృద్ధి శాఖ సెక్రటరి చేసిన సూచనలను పాటిస్తామని, అధికారులు కూడా ఆదేశాలు పాటించాల్సిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్.సి. కార్పోరేషన్ ఇంచార్జ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి. ఆనంద్ కుమార్, ఎస్.సి. అభివుద్ది శాఖ జాయింట్ డైరెక్టర్లు ఉమా దేవి, సురేష్ రెడ్డి, డిప్యూటి డైరెక్టర్లు అనురాధ, శ్రీనివాస రెడ్డి, హన్మంత్ నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.