×

CNN- అభ్యుదయ రైతులకు హరిత గృహాల(పాలీ హౌస్) ద్వారా ఉద్యాన సేద్యం లో ఆధునిక వ్యవసాయ విధానాలను అవగాహన చేసే వేదికగా సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ ని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు.

CNN- అభ్యుదయ రైతులకు హరిత గృహాల(పాలీ హౌస్) ద్వారా ఉద్యాన సేద్యం లో ఆధునిక వ్యవసాయ విధానాలను అవగాహన చేసే వేదికగా సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ ని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు.

అభ్యుదయ రైతులకు హరిత గృహాల(పాలీ హౌస్) ద్వారా ఉద్యాన సేద్యం లో ఆధునిక వ్యవసాయ విధానాలను అవగాహన చేసే వేదికగా సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ ని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి  శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు.

గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తో కలసి రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల లోని ఉద్యాన శాఖ వారి సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ లో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఉద్యాన సాగు లో నూతన మెళకువలు తెలుసుకునేందుకు ప్రత్యేక వేదిక కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం తో పాటు పక్క రాష్ట్రాల నుండి వచ్చే రైతులకు ఈ కేంద్రం లో శిక్షణ ఇచ్చేందుకు అని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వివిధ ఉద్యాన పంటల నారు తయారు చేసి రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులు ఉద్యాన పంటలలో నూతన రకాలను సాగు చేసేందుకు యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ చర్యలు, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, వంటి అంశాలను రైతులకు వివరంగా అందించేందుకు శిక్షణ గదులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సాంకేతిక సిబ్బంది, శాస్త్రవేత్తలు ఈ కేంద్రం లో నియమించబడతారని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ కేంద్రం ను రాష్ట్ర ముఖ్య మంత్రి గారు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. నిర్మాణం పనులు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఈ సమావేశం లో రాష్ట్ర ఉద్యాన శాఖ కమీషనర్ ఎల్. వెంకట్ రామ్ రెడ్డి, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ ఇంచార్జి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

<
>
print

Post Comment

You May Have Missed