Chief Minister K. Chandrashekar Rao has complemented the trial run of KTPS seventh phase construction. The trial run commenced with the lighting of the boiler. The CM congratulated TRANSCO, GENCO CMD D. Prabhakar Rao over the phone. The CM said for more transparency and for expediting of works, the construction of power plants work had been entrusted to the Public Sector Undertaking and said he is happy that the targets are being achieved. The CM felt that taking a cue from the KTPS, other plants such as Yadadri and Bhadradri should also be completed on a fast track. The CM also congratulated the employees and staff of electricity organizations who are working with dedication and commitment to fulfill the objective of making the Telangana state, a power surplus state.
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) 7వ దశ నిర్మాణంలో భాగంగా బాయిలర్ ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి సీఎం అభినందనలు తెలిపారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించాలనే లక్ష్యాలతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించామని, ఈ లక్ష్యం నెరవేరుతుండడం సంతోషకరంగా ఉందన్నారు. తక్కువ సమయంలో నిర్మిస్తున్న కేటీపీఎస్‌ను స్ఫూర్తిగా తీసుకొని భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని సీఎం అభినందించారు.