సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శనివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ కు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి, శ్రీనివాస ఆచార్యులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ దంపతులకు వేద పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు