నంద్యాల జిల్లా:
*శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు
*క్యూలైన్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
*భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించండి
*భక్తులకు పోలీస్ వారి సూచనలు
శ్రీశైల క్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్. పి. తెలిపారు.
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వివిధ క్యూ లైన్లు పరిశీలించి భక్తుల భద్రత కోసం అధికారులకు పలు సూచనలు చేశారు.
గుడి వెలుపల ఉన్న క్యూ లైన్ల నుండి అమ్మవారి దర్శనం అనంతరం నిష్క్రమణ వరకు ఏర్పాటైన మార్గాలను తనిఖీ చేశారు.
భద్రత పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రతి భక్తుడిని గుడి ప్రవేశ మార్గం లో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రధాన ద్వారం నుండి దర్శనం అనంతరం నిష్క్రమణ మార్గాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (DFMDలు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి తెలిపారు.
భక్తులు పోలీస్ వారు సూచించే మార్గనిర్దేశాలను అనుసరిస్తూ సురక్షితంగా దైవదర్శనం చేసుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా పాల్గొన్నారు.
*ఉగాది బ్రహ్మోత్సవాలకు బందోబస్తు నిమిత్తం వచ్చిన అధికారులకు , సిబ్బందికి మార్గనిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ
*గుడి లోపలికి ప్రవేశించే ప్రతి మార్గంలో DFMD లను ఏర్పాటు చేయాలి
*ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలికి అనుమతించండి
*జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS
ఉగాది బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా బందోబస్తు నిమిత్తం వివిధ జిల్లాల సుమారు 300 మంది సాయుధ బలగాలను అనగా APSP ,AR, స్పెషల్ పార్టీ లను శ్రీశైలం పోలీస్ స్టేషన్ నందు సమావేశ పరిచి బందోబస్తులో నిర్వహించవలసిన విధుల గురించి నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS దిశా నిర్దేశం చేసారు.
👉ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముందుగా సిబ్బందితో మాట్లాడుతూ మీకు ఏర్పాట్లు చేసిన వసతిలో గాని భోజన సదుపాయాలలో కానీ మరే ఇతర కారణాలలోనైన అసౌకర్యం కలిగిన వాట్సాప్ గ్రూప్ లో నేరుగా తెలియజేయవచ్చు.
👉బందోబస్తుకు వచ్చిన సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలి.
👉గుడి లోపలికి ప్రవేశించు మార్గాలలో తప్పనిసరిగా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (DFMD )ను ఉపయోగించాలి.
👉సాధారణ భక్తుల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలికి అనుమతించాలి.
👉శ్రీశైలం పరిసర ప్రాంతాలలో రోడ్డు ఓపెనింగ్ పార్టీ (ROP) లు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలి.
👉స్పెషల్ పార్టీ బృందాలు శ్రీశైలం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలి.
👉మీకు రిలీవ్ వచ్చేవరకు అప్పగించిన డ్యూటీ ప్రదేశాన్ని వదిలి వెళ్లరాదు.
👉ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలి.
👉ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ మార్గనిర్దేశం చేసారు.
