శ్రీశైల దేవస్థానం:మార్గశిర మాసశివరాత్రి రోజున ఆలయ వేళలో మార్పులు చేసారు. జనవరి 1వ తేదీన మార్గశిర మాసశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.భక్తుల సౌకర్యార్థం చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించేందుకు ఈ రోజు (25.12.2021) సాయంకాలం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.
ముఖ్యంగా భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, క్యూలైన్లలో అల్పాహారం ఏర్పాట్లు, సౌకర్యవంతమైనదర్శనం, అన్నప్రసాద వితరణ మొదలైన వాటికి సంబంధించి ఈ సమావేశం చర్చింది.
ఆలయ వేళలో మార్పులు :
జనవరి 1వ తేదీన వేకువజామున గం.3.00లకు ఆలయ ద్వారాలు తెరచి సుప్రభాతం, మహామంగళ హారతి, సర్కారీ సేవలుగా) నిర్వహిస్తారు. వేకువజామున మహా మంగళహారతి ప్రారంభం నుంచే అనగా 4గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతీస్తారు.
మధ్యాహ్నం 3.30గంటల నుంచి 4.30గంటల వరకు ఆలయశుద్ధి కార్యక్రమం చేస్తారు. తరువాత సుసాంధ్యం, ప్రదోషకాలపూజల అనంతరం సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. స్పర్శదర్శనం నిలుపుదల :
• భక్తులందరికీ త్వరితగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా జనవరి 1వ తేదీన స్వామివారి స్పర్శదర్శనం నిలుపుదల చేస్తారు. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. అదేవిధంగా జనవరి 1వ తేదీన గర్బాలయ అభిషేకాలు నిలుపుదల చేస్తారు. సామూహిక అభిషేక సేవాకర్తలకు, విరామ దర్శనం టికెట్ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకారదర్శనం మాత్రమే కల్పిస్తారు.
క్యూకాంప్లెక్స్లో దర్శనం కోసం వేచివున్న భక్తులందరికీ నిరంతరం మంచినీరుఅందిస్తారు.
అదేవిధంగా ఆయా సమయాలలో అల్పాహారం, బిస్కెట్లు కూడా ఇస్తారు.
అన్నప్రసాద వితరణ :
• భక్తులకు అన్నప్రసాద వితరణ మందిరం లో ఉదయం 10గంటల నుంచి అన్నప్రసాదాలను
అందిస్తారు.
లడ్డు ప్రసాదాలు:
• దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆలయ ద్వారాలు మూసేంతవరకు కూడా భక్తులకు లడ్డు ప్రసాద విక్రయకేంద్రాలలో లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతారు.