
*photos: Uyala Seva, Ankalamma special puuja,Kumara swamy puuja performed in the temple today.Archaka swaamulu performed the events.E.O. participated in Kumara swamy puuja.
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే సర్వదర్శనం క్యూలైన్లలోని సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీస్వామి అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేందుకు వీలుగా ప్రస్తుతం జరుగుతున్న ప్రోటోకాల్ దర్శన విధానంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకు , దేవస్థాన ధర్మకర్తల మండలి సూచనల మేరకు ఈ మార్పులు చేస్తున్నామని ఈ ఓ తెలిపారు.
ఈ నెల 5వ తేదీ నుండి ఈ విధానం అమలులోకి రానుంది.ఈ నూతన విధానం తో సర్వదర్శనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో భాగంగా రోజులో రెండు పర్యాయాలుగా కేవలం నిర్దిష్ట సమయాలలో మాత్రమే క్షేత్రాన్ని
దర్శించే ప్రముఖులకు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రతీరోజు ఉదయం గం. 5.30ల నుంచి గం. 6.15 వరకు తిరిగి రాత్రి గం. 700ల నుండి గం. 7.30ల
వరకు ప్రముఖులకు విరామ దర్శనాన్ని / అభిషేకం – కుంకుమార్చన జరిపించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న స్పర్శదర్శనం సమయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం
గం. 7.00ల నుండి గం. 8.15ల వరకు ,మధ్యాహ్నం గం. 12.30 నుంచి గం. 1.15ల వరకు, రాత్రి గం.
9.00ల నుంచి 11.00ల వరకు స్పర్శ దర్శనాలు కొనసాగుతాయి.
ప్రస్తుతం మంగళవారం నుంచి శుక్రవారం వరకు , మధ్యాహ్నం గం.2.00ల నుంచి 4.00ల వరకు
సాధారణ భక్తులకు కల్పిస్తున్న ఉచిత స్పర్శదర్శనం యథావిధిగా కొనసాగుతుంది. ఈ భక్తులు
మధ్యాహ్నం గం. 1.30ల నుంచి గం.2.00లలోపల క్యూకాంప్లెక్స్ లో రిపోర్టు చేయవలసి వుంటుంది.
ఆలయానికి విచ్చేసే ప్రముఖులు తమ పర్యటన వివరాలు కనీసం రెండు రోజులు ముందస్తుగా
తెలియజేయవలసి వుంటుంది.
ప్రముఖులకు వసతి/ దర్శనం | ఆర్జిత సేవలను ఇతరులకు సిఫారసు చేయు విధానం లో ప్రస్తుతం
అమలులో ఉన్న ఎస్.ఎం.ఎస్. వాట్సాప్ సందేశ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు.
- వసతి గదుల నిమిత్తం / దర్శనం! ఆర్జితసేవ సిఫారసులకు సంబంధించి ప్రముఖులందరు విధిగా వారి
లెటర్ హెడ్ పై కనీసం రెండు రోజుల ముందుగా (రాత్రి 9 గంటల వరకు) సమాచారాన్ని దేవస్థానానికి తెలియజేయాల్సి వుంటుంది. ఈ లేఖలను protocol@ srisailadevasthanam.org మెయిల్ ఐ.డికి
పంపవలసివుంటుంది. ఈ లేఖలను ప్రోటోకాల్ ఫోన్ నెం. 9160016215 కు వాట్సాప్ ద్వారా
కూడా పంపవచ్చు.
ప్రస్తుతం ప్రముఖులందరు సిఫారసు లేఖలను, సిఫారసు సంక్షిప్త సమాచారాన్ని నేరుగా దేవస్థానం
కార్యనిర్వహణాధికారి ఫోన్ నెంబరుకు పంపుతున్నారు. ఇక మీదట కార్యనిర్వహణాధికారి
ఫోన్ నెంబరుకు కాకుండా ప్రోటోకాల్ నెంబరుకే సమాచారాన్ని పంపవలసివుంటుంది.
సిఫారసు లేఖలలో స్పష్టంగా వసతి కావలసిన తేదీలు, కావలసిన దర్శనం / ఆర్జిత సేవల వివరాలను
తప్పనిసరిగా పొందుపర్చవలసివుంటుంది.సదరు లేఖలో దర్శనానికి విచ్చేసే భక్తాదుల ఆధారుకార్డు నెంబర్లు / భక్తబృందంలోని ప్రధాన వ్యక్తి ఫోను నెంబర్లు కూడా తప్పని సరిగా పొందుపరచవలసి వుంటుంది.
వసతి దర్శనం / అర్చన నిర్ధారించబడిన వివరము సంక్షిప్త సందేశం ద్వారా భక్తులకు తెలియజేసే విధంగా
సాఫ్ట్వేరు రూపొందిస్తున్నారు.
సిఫారసు లేఖపై వచ్చిన వారు శ్రీశైలానికి విచ్చేయునప్పుడు వారు పొందిన సిఫారసు లేఖ అసలు ప్రతిని
దేవస్థాన వసతి కల్పన కార్యాలయం లో సమర్పించవలసివుంటుంది.
సదరు లేఖను ముందస్తుగా వాట్సాప్ | దేవస్థాన అధికారిక మెయిల్ కు వచ్చిన లేఖతో సరిపోల్చుకుని వారికి వసతి / దర్శన / ఆర్జిత సేవల ఏర్పాట్లను కల్పిస్తారు.
- లేఖలపై వచ్చిన భక్తులందరు కూడా గుర్తింపు కోసం ఆధారుకార్డు నకలు ప్రతిని తప్పనిసరిగాసమర్పించాల్సి వుంటుంది. ప్రవాస భారతీయులు పాసుపోర్టును తీసుకొని రావచ్చు.
మరుసటి రోజునాటి సిఫారసు లేఖల భక్తుల జాబితాను ( Arrival List) ముందురోజు ఉదయం గం.
11.00ల తరువాత సిద్ధం చేస్తారు. అవకాశం మేరకు అందుబాటులో ఉన్న వసతి దర్శన/
ఆర్జితసేవలను మాత్రమే కల్పిస్తారు.
సిఫారసు లేఖల ద్వారా వచ్చే భక్తులందరినీ నిర్దిష్ట సమయం లో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
దర్శనం టికెట్లు / ఆర్జిత సేవా టికెట్లను స్కానింగ్ విధానం లో తనిఖీ చేసిన తదుపరే అనుమతించేలా
చర్యలు తీసుకుంటున్నారు. దర్శనం టికెట్లు / ఆర్జిత సేవాటికెట్లపై దర్శనం, ఆర్జిత సేవలు
జరిపించే సమయం పొందుపర్చడం జరుగుతుంది. టికెట్ పై ఉన్న సమయం ప్రకారంగానే భక్తులను
ఆలయం లోనికి అనుమతించేలా చర్యలు తీసుకుంటారు. ఈ సిఫారసు లేఖల ద్వారా వచ్చే
భక్తులతో పాటు దేవస్థానానికి అధిక మొత్తంలో విరాళాలు చెల్లించిన దాతలకు, వారు సిఫారసు చేసిన
వారికి కూడా ప్రాధాన్యత ఇస్తారు.
భక్తులందరు ఈ విషయం లో సహకరించవలసినదిగా ఈ ఓ కోరారు.
మహామంగళహారతి దర్శనంలో మార్పులు:
ఈ నెల 5వ తేదీ నుంచి ఉదయాస్తమానసేవ , ప్రదోషకాల సేవాకర్తలకు స్వామివారి అంతరాలయం నుంచి మహామంగళహారతి దర్శనం కల్పించవలసివుంది.
ఈ ఉదయాస్తమానసేవ , ప్రదోషకాలసేవలలో ఒక్కొక్క సేవకు రోజుకు ఆరు టికెట్లు ఇస్తారు.
స్థలాభావం కారణంగా ఇతరులకు స్వామివారి అంతరాలయం నుంచి మహామంగళహారతి దర్శనం కల్పించే అవకాశం ఉండదు. ఈ మార్పును గమనించవలసినదిగా భక్తాదులకు వినతి చేస్తున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే మహామంగళహారతి దర్శన ప్రారంభం నుంచే సర్వదర్శనం క్యూలైన్లోని సామాన్య భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతిస్తారు.
సాధారణ భక్తులు ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే మహామంగళహారతి సమయంలో కొనసాగే సర్వదర్శనం క్యూలైన్ ద్వారా స్వామివార్లను దర్శించుకోవచ్చు.
అంతరాలయం నుంచి మహామంగళహారతిదర్శనం పొందగోరే భక్తులు ఉదయాస్తమానసేవ లేదా ప్రదోషకాలసేవాటికెట్లను పొందవచ్చును.
ఈ సేవలకు దేవస్థాన వెబ్ సైట్ www. Srisailadevasthanam.org ద్వారా సేవా రుసుమును చెల్లించి టికెట్లను పొందవచ్చును.
ఆన్లైన్ బుకింగ్ టికెట్లు మిగిలిన సందర్భాలలో కార్యనిర్వహణాధికారి ముందస్తు అనుమతితో కరెంట్ బుకింగ్ ద్వారా కూడా ఈ టికెట్లు ఇస్తారు. ఆన్ లైన్ లో మిగిలిన ఉదయాస్తమానసేవా, ప్రదోషకాల సేవాటికెట్లను భక్తులు గంగాసదన్ లోని ఆర్జిత సేవాకౌంటర్ నుండి పొందవచ్చు.