• భక్తుల రద్దీ కారణంగా డిసెంబరు 8వ తేదీ వరకు సాధారణ భక్తులకు శ్రీశైల శ్రీస్వామివార్ల స్పర్శదర్శనాన్ని నిలుపుదల చేశామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేశారు.
• ఈ నెల 1వ తేదీన కార్తీకమాస శివదీక్షా విరమణ ప్రారంభమైన కారణంగా శివదీక్షా భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. ఈ రద్దీకారణంగా సామాన్య భక్తులకు స్పర్శదర్శనం నిలుపుదల
• డిసెంబరు 5 వ తేదీ వరకు అనగా శివదీక్షా విరమణ ముగిసేంతవరకు జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షా భక్తులకు విడతల వారిగా అనగా ప్రతీ రెండు గంటలకు ఒకసారి స్పర్శదర్శనం కల్పించడం జరుగుతోంది.
• వారాంతపు సెలవులు . సోమవారం కారణంగా ఈ నెల 6,7,8 తేదీలలో కూడా భక్తులరద్దీ కొనసాగే అవకాశం ఉంది.
• అందుకే ఈ రోజులలో అనగా 8వ తేదీ వరకు కూడా భక్తులందరికీ కూడా కేవలం అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుంది.
• భక్తులందరు ఈ మార్పును గమనించి దేవస్థానానికి సహకరించగలరు.
