×

31 నుంచి స్వామివార్ల స్పర్శదర్శన వేళలలో మార్పులు

31 నుంచి స్వామివార్ల స్పర్శదర్శన వేళలలో మార్పులు

శ్రీశైల దేవస్థానం:  దేవస్థానం మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులందరికీ కల్పిస్తున్న శ్రీస్వామివారి స్పర్శదర్శన వేళలు మార్పులు చేసారు.

ఈ నెల 31వ తేది నుంచి వారంలో నాలుగు రోజులపాటు  మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం గం.2.00ల నుంచి గం.4.00ల వరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనంవుంటుంది.

 గతం లో వారంలో నాలుగు రోజులలో ( మంగళవారం నుంచి శుక్రవారం వరకు) మధ్యాహ్నం గం.2.00ల నుంచి గం.3.00ల వరకు , తిరిగి సాయంత్రం  గం.6.00ల నుంచి గం.7.00ల వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పించేవారు.

అయితే మధ్యాహ్నం గం. 3.00ల తరువాత స్వామివారి అలంకార దర్శనం మాత్రమే లభిస్తున్నదని, స్వామివార్ల స్పర్శదర్శనం కోసం తిరిగి సాయంత్రం గం.6.00ల వరకు వేచి వుండాల్సి వస్తున్నదని, దీనివలన దర్శనానంతరం ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇబ్బందికరంగా ఉన్నదని పలువురు భక్తులు దేవస్థానం దృష్టికి తీసుకువచ్చారు.   దర్శనానంతరం వారి వారి ప్రాంతాలకు వెళ్ళేందుకు వీలుగా మధ్యాహ్నం గం. 3.00ల తరువాత కూడా శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించవలసిందిగా   భక్తులు కోరారు.

భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మధ్యాహ్నం గం.2.00ల నుంచి గం.4.00ల వరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించారు.

మధ్యాహ్నం గంటసేపు అదనంగా స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా గతంలో సాయంకాలం గం.6.00ల నుంచి గం.7.00ల వరకు అమలులో ఉన్న స్పర్శదర్శన సదుపాయం నిలుపుదల చేసారు.అదేవిధంగా స్వామివారి స్పర్శదర్శనానికి వచ్చే భక్తులందరు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావలసి వుంటుంది.

సంప్రదాయ వస్త్రధారణలో పురుషులు పంచ,  కండువాను, మహిళలు చీర,  రవిక లేదా చున్నీతో కూడిన సల్వార్ కమీజ్ లను ధరించవలసి వుంటుంది.

*Donation of Rs.1,00,000 for Annadanam  Smt S.Ashwini, Bangalore, Karnataka donated  Rs.1,00,000 for Annadanam scheme.

print

Post Comment

You May Have Missed