×

చంద్రగ్రహణం- ఆలయ ద్వారాలు మూసివేత వివరాలు

చంద్రగ్రహణం- ఆలయ ద్వారాలు మూసివేత వివరాలు

 శ్రీశైల దేవస్థానం:ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆరోజు సాయంత్రం గం. 5.00ల నుంచి మరుసటి రోజు  29వ తేది ఉదయం గం. 5.00ల వరకు ఆలయద్వారాలను మూసివేస్తారు.

29వ తేది ఉదయం 5.00 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ, ప్రాత:కాల పూజల అనంతరం 7 గంటల నుండి దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర అర్జితసేవలు జరుగుతాయి.

 చంద్రగ్రహణం రోజైన 28వ తేదీన మధ్యాహ్నం గం. 3.30ల వరకు మాత్రమే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం గం. 12.30ల వరకు మాత్రమే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ రోజున సామూహిక అభిషేకాలు ఉదయం మాత్రమే నిర్వహిస్తారు. అదేవిధంగా స్వామివారి స్పర్శదర్శనానికి ( రూ.500/-లు టికెట్) ఉదయం మాత్రమే అవకాశం వుంటుంది.మధ్యాహ్నం గం. 12.30లకు నిర్వహించే సామూహిక అభిషేకాలు , స్పర్శదర్శనం నిలుపుదల చేస్తారు.

ఇక గ్రహణం రోజున మధ్యాహ్నం గం. 3.30ల నుండి మంగళవాయిద్యాలు, సుసాంధ్యం, సాయంకాల పూజలు, మహామంగళ హారతులు జరిపించబడుతాయి. అనంతరం గం. 5.00లకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు.

గ్రహణం రోజున శ్రీస్వామివార్ల నిత్యకల్యాణం కూడా నిలుపుదల చేస్తారు.

గ్రహణం కారణంగా పైన తెలపబడిన విధంగానే ఆలయప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు,  సాక్షిగణపతి, హాఠకేశ్వరం – ఫాలధార పంచధార , శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు కూడా సాయంత్రం గం.5.00ల నుండి మూసివేయబడుతాయి.

మధ్యాహ్నం వరకే అన్నప్రసాద వితరణ:

గ్రహణం కారణంగా 28న  భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా ఉదయం గం.10.00ల నుండి మధ్యాహ్నం వరకే వుంటుంది. ఆ రోజు రాత్రి అల్పాహార వితరణ నిలుపుదల చేస్తారు.

print

Post Comment

You May Have Missed