
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా మూడవ రోజైన ఈ రోజు (09.10.2021) న ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిగాయి.
శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు.
ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.
ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్తాన సేవ, సువాసినీ పూజలు ప్రత్యేకం.
కుమారి పూజ
దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూ జించారు . కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
| చంద్రఘంట అలంకారం |
ఈ నవరాత్రి మహోత్సవాలలో నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని చంద్రఘంట స్వరూపంలో అలంకరింపజేయడం ప్రత్యేకం.
నవదుర్గలలో మూడవ రూపమైన ఈ దేవి దశ భుజాలను కలిగి ఉండి ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపిణిగా ఉంటుంది. ఈ దేవి శాంతస్వరూపిణి అయినప్పటికీ యుద్దాన్ముఖురాలై ఉండటం విశేషం.
ఈ అమ్మవారి మస్తకంపై అర్థచంద్రుడు అలరాడుతున్న కారణంగా ఈ దేవిని చంద్రఘంటాదేవిగా పిలుస్తారు.
ఈ దేవిని పూజించడం వల్ల భక్తుల కష్టాలన్నీ తీరుతాయని చెప్పబడుతోంది. ఇంకా ఈ దేవీ ఆరాధన వల్ల సౌమ్యం, వినమ్రత కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు రావణవాహనసేవ మరో ప్రత్యేకం. ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, రావణవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు ఇంకా ప్రత్యేకం.