ఉచిత సామూహిక సేవగా చండీహోమం
శ్రీశైల దేవస్థానం:ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం శుక్రవారం ఉచిత సామూహిక సేవగా చండీహోమాన్ని నిర్వహించింది.
తెల్లరేషన్కార్డు కలిగిన వారి సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహిక సేవలలో భాగంగా చంద్రవతి కల్యాణ మండపంలో చండీహోమం నిర్వహించారు. ఈ ఉచితసేవకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తులచేత ఉదయం సామూహిక చండీహోమం జరిపించారు.ముందుగా భక్తులందరి గోత్రనామాలతో సంకల్పం
జరిపారు.అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేసారు. తరువాత చండీహోమం జరిగింది .
హోమములో పాల్గొన్న భక్తులందరికీ అతిశ్రీఘ్ర దర్శనం క్యూలైను ద్వారా శ్రీస్వామివార్ల దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.సేవాకర్తలకు 2 లడ్డు ప్రసాదాలు అందించారు.
దర్శనానంతరం భక్తులందరికీ దేవస్థానం అన్నపూర్ణ భవనం లో భోజన సదుపాయం కూడా కల్పించారు.
సామూహిక చండీహోమంలో స్థానికులే కాకుండా నంద్యాల, కర్నూలు, మార్కాపురం, తెనాలి, తిరుపతి, బాపట్ల, అనంతపురం, గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు.
Post Comment