×

 శ్రీశైల దేవస్థాన భవనాలను పరిశీలించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులు చక్రపాణి

 శ్రీశైల దేవస్థాన భవనాలను పరిశీలించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులు చక్రపాణి

 శ్రీశైల దేవస్థానం:దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డివారి చక్రపాణిరెడ్డి బుధవారం  పలు దేవస్థాన భవనాలను పరిశీలించారు.పెద్దసత్రము, శివసదనము, చల్లా వెంకయ్య సత్రం, పొన్నూరు సత్రము మొదలైన వాటిని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పరిశీలించారు.ఈ పరిశీలనలో ఆయా భవన సముదాయాలలో నివసిస్తున్న పలువురితో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ అందరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అన్ని భవనాలలో కూడా ఎలక్ట్రికల్ వైరింగును పరిశీలించి అవసరమైతే తగు మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.తరువాత వారు శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయాన్ని పరిశీలించారు.

వైద్యశాల పరిశీలన:

దేవస్థానం వైద్యశాలను కూడా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పరిశీలించారు.ఈ సందర్భంగా వైద్యశాలలో చేపడుతున్న వైద్యపరీక్షలు, వైద్యశాలలో అందుబాటులో ఉన్న వైద్యపరికరాలు, రోజువారిగా వచ్చే అవుట్  పేషంట్ల వివరాల నమోదు మొదలైన అంశాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యశాలలో అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.ముఖ్యంగా ప్రాణప్రాయ స్థితిలో ఉన్నవారికి ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణ వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పంపేందుకు అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వైద్యశాల అభివృద్ధి కొరకు దాతల సహకారాన్ని కూడా పొందడం జరుగుతుందన్నారు. ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి అధ్యక్షులతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఐసి) శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు బి. మల్లికార్జునరెడ్డి, జి.స్వాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అన్నప్రసాద వితరణ విభాగ పరిశీలన:

దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి  అన్నప్రసాద వితరణ విభాగాన్ని  పరిశీలించారు.అన్నదాన విభాగములో అన్నదానం స్టోరు, వంటశాల, కూరగాయలు నిల్వచేయు శీతలగది, అన్నదాన విరాళాల సేకరణ కేంద్రం మొదలైన విభాగాలను పరిశీలించారు.తరువాత వంటశాలలో  అన్నప్రసాద వితరణకు వండిన వంటకాలను పరిశీలించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ అన్నప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులతో మర్యాదతతో మెలగాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజు కూడా అన్నప్రసాద వితరణ గురించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నప్రసాద వితరణ విభాగపు పర్యవేక్షకులను ఆదేశించారు.

 అన్నప్రసాదాల వితరణకు సంబంధించి ఖచ్చితంగా సమయపాలనను పాటించాలన్నారు.

తరువాత భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదేవిధంగా పలువురు భక్తులతో సంభాషిస్తూ దేవస్థాన అన్నప్రసాద వితరణ గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, పర్యవేక్షకులురాలు పి. దేవిక, సీనియర్ అసిస్టెంట్ ఎం. శ్రీనివాసరావు, అన్నదాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుల పరిశీలనలో దేవస్థానం ఎడిటర్ డా. సి.అనిల్ కుమార్ పాల్గొన్నారు.

 హనుమజ్జయంతి :

హనుమజ్జయంతిని పురస్కరించుకుని  శ్రీ ఆంజనేయస్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

శ్రీశైలంలోని పాతాళగంగమార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి.

లోక కల్యాణం కోసం జరిపిన ఈ విశేషపూజలలో భాగంగా ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలలో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని అర్చకులు సంకల్పాన్ని చెప్పారు.

తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిగింది.అనంతరం ఆంజనేయస్వామి వారికి ఆయా సూక్తలతో పంచామృతాభిషేకం, జలాభిషేకం చేసారు.తరువాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తర పూజ, నాగవల్లిదళపూజ (ఆకుపూజ), వడమాల సమర్పణ, పుష్పార్చన జరిగాయి.

( సాంస్కృతిక కార్యక్రమాలు ):

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం)  సంగీత సిస్టర్స్ & బృందం, హైదరాబాద్   భక్తి సంగీత విభావరి కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద  సాయంకాలం నుండి  భక్తి రంజని కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమములో శ్రీ విఘ్నేశ్వరాజంభజే, భో..శంభో, తదితర గీతాలను, పలు స్తోత్రాలను కె.నిహిత చంద్రిక, కె. నందిని, ఎం. కీర్తి చంద్రిక, ఎం. భవ్యచంద్రిక, శ్రీమతి లత, నారాయణమూర్తి తదితరులు ఆలపించారు.

ఈ కార్యక్రమానికి తబల సహకారం  జి. కుమారస్వామి, కీబోర్డు సహకారాన్ని మూర్తి అందించారు.

 

print

Post Comment

You May Have Missed