శ్రీశైల దేవస్థానంలో సిహెచ్. వీరాంజనేయశర్మ ఉద్యోగ విరమణ
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్. వీరాంజనేయశర్మ ఈ రోజు (31.10.2021)న వయసు రీత్యా ఉ ద్యోగవిరమణ చేసారు. ఈ సందర్భంగా వీరాంజనేయశర్మ గౌరవార్థం దేవస్థాన కార్యాలయ సమావేశ మందిరంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం జరిగింది.
దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న అధ్యక్షతన జరిగిన ఈ సమవేశంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వీరాంజనేయశర్మ దేవస్థానంలో 41 సంవత్సరాలపైగా విధులను నిర్వహించి శ్రీస్వామిఅమ్మవార్ల కృపా కటాక్షాలను పొందారన్నారు.వీరి శేషజీవితం కూడా ఆధ్యాత్మిక మార్గంలో సాగాలని ఆకాంక్షించారు. తరువాత పలువురు అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ వీరాంజనేయశర్మ సేవలను కొనియాడారు.
సిహెచ్. వీర ఆంజనేయశర్మ సెప్టెంబరు, 1980లో దేవస్థానంలో నియామకాన్ని పొందారు. మొత్తం 41 సంవత్సరాలకు పైగా వీరు దేవస్థానంలో విధులను నిర్వహించారు.కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి వీరికి శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
Post Comment