జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సూచనలు*
కర్నూలు డిసెంబర్ 21:-ఈనెల 22వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులు ఎవరికి కేటాయించిన విధులు వారు సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ నెల 22వ తేదీ జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ , జాయింట్ కలెక్టర్( రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు , డి ఆర్ ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22 తేదీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ దిగినప్పటి నుంచి పర్యటన పూర్తయ్యే వరకు ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా అధికారులకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు.