వివిధ సౌకర్యాలతో జగనన్న కాలనీలు

  • కర్నూలు జిల్లా   నన్నూరు  గ్రామ సమీపంలో లబ్ధిదారులకు ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్,  శాసనసభ్యులు తదితర అధికారులు.

కర్నూలు, జూన్ 03 :-జగనన్న కాలనీలో విశాలమైన రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, అండర్‌ గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

గురువారం క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు.

నన్నూరు గ్రామం జగనన్న హౌసింగ్ కాలనీలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణ పనులు ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె. సుధాకర్, నగర మేయర్ బి.వై.రామయ్యలు, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed