శ్రీశైల దేవస్థానం: శ్రీశైల ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఇత్తడి నామ ఫలకాలు ( బోర్డులు) ఏర్పాటు చేసారు .
పరివార ఆలయాలు, దేవతా మూర్తుల పేర్లు, ఆయా మండపాల పేర్లు, భక్తులకు తెలిసేందుకు వీలుగా ఈ నామ ఫలకాలు ఏర్పాటు చేసారు.
పరివార ఆలయాలైన వృద్ధ మల్లికార్జునస్వామి ఆలయం, సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, ఉమామహేశ్వరస్వామి ఆలయం, రాజరాజేశ్వరస్వామి ఆలయం, రాజరాజేశ్వరీదేవి ఆలయం,పాండవులు ప్రతిష్టించిన పంచలింగాలు, నవబ్రహ్మ ఆలయాలు, అమ్మవారి ఆలయం లోని మహాకాళి, మహాలక్ష్మి మహాసరస్వతిదేవి, శనగల బసవన్న, వాహన మండపం మొదలైన మండపాల వద్ద , మల్లికాగుండం, మనోహరగుండం మొదలైన గుండాల వద్ద ఈ నామ ఫలకాలను ఏర్పాటు చేసారు.
మొత్తం 100కు పైగా ఈ ఇత్తడి నామ ఫలకాలను ఏర్పాటు చేసారు.