
శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవ రోజు(14.01.2022) న శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు. అనంతరం లోకకల్యాణంకోసం జపాలు, రుద్రపారాయణలు, చతుర్వేద పారాయణలు జరిగాయి.
తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా చేసారు.
అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోష కాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు చేసారు.
రావణవాహన సేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు రావణవాహనసేవ జరిగింది.
ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు.
తరువాత ఆలయ ప్రాకారోత్సవం జరిగింది.
ఈ ప్రాకారోత్సవంలో హరిదాసు, శంఖం, జేగంట, ఢమరుకం మొదలైన వాటితో పాటు కోలాటం, చెక్కభజన, డోలు విన్యాసాలు మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేసారు.
రేపటి కార్యక్రమాలు
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు(15.01.2022)న శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు, చండీశ్వర పూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్టానాలు, రుద్రహోమం, సాయంకాలం నిత్య హవనాలు, బలిహరణలు మొదలైన కార్యక్రమాలు చేస్తారు.
ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు నందివాహనసేవ వుంటుంది.
* Bhagawanth Khubha, Union Minister of State for Chemicals and Fertilizers participated in the festival.