పశ్చిమ శివవీధి గ్యాలరీ నిర్మాణాన్ని నాణ్యతో సకాలంలో పూర్తి చేయాలి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం: పశ్చిమ శివవీధి (పశ్చిమమాడవీధి) గ్యాలరీ నిర్మాణానికి సోమవారం  భూమిపూజ జరిగింది.

సుమారు 600 అడుగుల పొడవుతో ఈ గ్యాలరీని నిర్మిస్తారు. ఈ గ్యాలరీ నిర్మాణ అంచనా వ్యయం రూ. 92లక్షలు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు  మేరాజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు  తన్నీరు ధర్మరాజు  భూమిపూజ నిర్వహించారు.

కార్యక్రమం లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, సహాయ స్థపతి. ఐ. యు.వి. జవహర్ లాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు ప్రణయ్, భవన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ సకాలంలో గ్యాలరీ నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.అదేవిధంగా నిర్మాణంలో పూర్తి నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.

print

Post Comment

You May Have Missed