
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (11.11.2021)టి.బాలయోగి,చీమకుర్తి వారి బృందంచే భక్తి రంజని కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ భక్తి రంజని కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణపతి స్తుతి, లింగాష్టకం, శివాష్టకం, హే విశ్వ లింగా..హే వాయులింగ..హే ఆత్మలింగా… గంగా తరంగ కమనీయ జటా కలాప, ముగ్గురమ్మలు కలిసి వెలిసిన ప్రతిభ నీవమ్మా, శివధ్యానసాగరం చేరుమా తదితర గీతాలను టి. బాలయోగి ఆలపించారు. ఈ కార్యక్రమానికి కీ బోర్డు సహకారాన్ని టి.శివకుమార్ అందించగా, తబలా సహకారాన్ని కె.శ్రీనివాస్, గజల సహకారాన్ని సీతారాం అందించారు.
అదేవిధంగా శివ డాన్స్ అకాడమీ, శ్రీశైలం ప్రాజెక్టుకాలనీ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో శివతాండవం,శివ శివ శంకరా, హర హర మహాదేవ, నాట్యం, శివాష్టకము, భో.. శంభో.. శివశంభో… శివస్తుతి తదితర గీతాలకు జి.శ్రావణి, ఎస్. వేదశ్రీ, కె. చైత్ర, సిహెచ్. భాగ్యశ్రీ, జి.ప్రణవి, సిహెచ్. సాయి లాలిత్య, ఎ. జయశ్రీ, డి. వెంకట యశస్వి, కె. భావజ్ఞ, డి. కీర్తన, పి.రితిక, ఎం.జయశ్రీ తదితరులు నృత్య ప్రదర్శనను సమర్పించారు.
| రేపటి నిత్య కళారాధన
రేపు (12.11.2021) శ్రీమతి సి హెచ్. సౌజన్య,విశాఖపట్నం వారిచే సంప్రదాయ నృత్యం, శ్రీమతి గడ్డం మహేశ్వరి, కర్నూలు వారిచే భక్తిరంజని కార్యక్రమం ఏర్పాటు చేసారు.
*E.O. S.Lavanna participated in Aaakaashadeepotsavam today.