×

సరస్వతి సంగీత శిక్షణ నిలయం, హైదరాబాదు సమర్పించిన  భక్తిరంజని

సరస్వతి సంగీత శిక్షణ నిలయం, హైదరాబాదు సమర్పించిన  భక్తిరంజని

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (31.12.2021) సరస్వతి సంగీత శిక్షణ నిలయం, హైదరాబాదు వారు  భక్తిరంజని కార్యక్రమం సమర్పించింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి భక్తి రంజని కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో గంగం గణపతిం, మహాదేవ, శివశివ భవ, కైలాసగిరి, ఆది దేవ,ఈశ్వరా, శివుని శిరసు, శివపూజ, శివంకరి,శంభో.. శంభో.. శివ శంభో… నమఃపార్వతీ, శంకరం శంకరం, జయరామ లింగేశ్వర తదితర భక్తి గీతాలను ప్రతిమాశశిధర్, శిరిష, భానుశ్రీ, శార్వరీ, సాయిసంకల్స్, దిలీప్, రాజశేఖరరెడ్డి, చక్రవర్తి ఆలపించారు.

ఈ కార్యక్రమానికి మృదంగ సహకారాన్ని  కె.వి.ఎస్. వీరాస్వామి, వయోలీన్ సహకారాన్ని  డి. జయసూర్య అందించారు.

 రేపటి నిత్య కళారాధన

రేపు (01.01.2022) మల్లాది అనూష నెల్లూరు వారి బృందంచే  కర్ణాటక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసారు.

print

Post Comment

You May Have Missed