అలరించిన శ్రీ వనపర్తి సత్యంస్వామి బృందం భక్తిరంజని
*Ankalamma Vishesha Puuja,Uyala Seva performed in Srisaila temple on 29th Oct.2021. E.O. participated in Uuyala seva. Archaka swaamulu performed the events.
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (29.10.2021) న శ్రీ వనపర్తి సత్యంస్వామి వారి బృందం భక్తిరంజని కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.7:00 ని||ల నుండి ఈ భక్తిరంజని కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశైలగిరియందు, శంకరా నాదశరీరపర, నమోభూతనాథ, శివశివశంకర, శివశంకరీ, అమ్మవు నీవమ్మ, ఎవరికి ఎవరయ్య, ఎందుకయ్య కోపము, శంకరా శివ శంకరా వంటి తదితర భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి తబల సహకారం ఆదిత్యవర్ధన్, కీ బోర్డు సహకారం కృష్ణచైతన్య అందించారు.
ఈ భక్తిరంజనిలో వనపర్తి సత్యంస్వామితో పాటు రాజశేఖర రెడ్డి, శివకుమార్ తదితరులు ఆయా భక్తి గీతాలు గానం చేసారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు, జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
| రేపటి నిత్య కళారాధన
రేపు (30.10.2021)న శ్రీమతి దుర్గ రాజేశ్వరి, ఈశ్వర్ కూచిపూడి క్షేత్రం, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
Post Comment