
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో ఈ రోజు (17.12.2021) బి. గీతాంజలి, కర్నూలు బృందం భక్తిరంజని కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి భక్తి రంజని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో మహాగణపతిం, వాతాపి గణపతిం, నమ:శివాయ, శివాష్టకం, భో…
శంభో, శివ శివ అనరాదా తదితర భక్తి గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమానికి మృదంగ సహకారాన్ని సుధాకర్, తబలా సహకారాన్ని బాలు, కీబోర్డు సహకారాన్ని మహేష్ అందించారు.
రేపటి నిత్య కళారాధన
రేపు (18.12.2021)న శ్రీమతి పద్మావతి, కర్నూలు బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తుంది.