
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం జి. సుబ్బిరెడ్డి, బృందం, అనంతపురం వారు భజన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ కార్యక్రమం జరిగింది.
వినాయకస్తుతి, పాతాళగంగమ్మ, ఎవరికీ ఎవరయ్యా, ఈశ్వరా, నీ పాదసేవయే నమ:శివాయా ఓం నమో శివాయా, జనని శివకామిని మొదలైన పలు భక్తిగీతాలు, అష్టకాలను జి. సుబ్బారెడ్డి, బి. చిన్నఓబులేసు, శ్రీనాథ్ రెడ్డి, పెన్నయ్య, నాగిరెడ్డి, లక్ష్మీనారాయణ, కె. శ్రీనివాసులు, వెంకటేశులు, లక్ష్మీనారాయణ, నారాయణస్వామి, బాలగుర్రప్ప, నాగలింగారెడ్డి, ఆదెమ్మ, లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, చిన్నక్క, రాధ తదితరులు ఆలపించారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.