
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) గురువారం శ్రీమతి పి. ప్రమీల రాణి, శ్రీనివాస భజన బృందం, విజయవాడ వారు భజన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం గం.6:30 ని||ల నుండి భజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమం లో విఘ్నేశ్వర ప్రార్థన, లింగాష్టకం, హర హర శంకరా, శివ శివ శంభో, కైలాసశంకర తదితర గీతాలను ప్రమీలారాణి, స్వరూపరాణి, విజయలక్ష్మి పార్వతి, ఉమాదేవి, రాజ్యలక్ష్మి పద్మ, భద్రమ్మ, కస్తూరి, అరుణ, దేవి, రమణమ్మ, శివశంకర్ తదితరులు పాడారు.
శుక్రవారం నిత్య కళారాధన:శుక్రవారం జె.మాధురి, నంద్యాల బృందం భక్తి సంగీత విభావరి కార్యక్రమం సమర్పిస్తుంది.
*Kumara Swamy Puuja ,Dattathreya Swamy Puuja performed by Archaka swaamulu.