
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శుక్రవారం
గాయత్రి భజన మండలి యు.బొల్లవరం భజన కార్యక్రమం నిర్వహించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి భజన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో పలు భక్తి గీతాలు, అష్టకాలు మొదలైన వాటిని రామన్నగౌడు, శివారెడ్డి, బ్రహ్మానందారెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి,రాములమ్మ లక్ష్మీదేవి,రమణమ్మ సుబ్బమ్మ, రాజేశ్వరిరెడ్డి తదితరులు భజన చేసారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
16 న సాంస్కృతిక కార్యక్రమాలు
16న టి. పి. మోహన్ కుమార్ బృందం హైదరాబాదు భక్తి సంగీత విభావరి సమర్పిస్తుంది.