×

అఖండ శివచతుస్సప్తాహభజన ప్రారంభం

అఖండ శివచతుస్సప్తాహభజన ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం ప్రతి ఏటా కార్తికమాసంలో అఖండ శివచతుస్సప్తాహభజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందరికి కూడా శ్రేయస్సు కలగాలనే భావనతో ఈ భజనలు జరుగుతున్నాయి.ఈ అఖండ శివభజనల వల్ల భక్తులలో భక్తిభావాలు, ఆధ్యాత్మికత పెంపొందడమే కాకుండా, క్షేత్ర వైశిష్ట్యం కూడా మరింతగా పెరుగుతుంది.ఈ అఖండ శివ భజనలు  బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.రాత్రింబవళ్ళు నిరంతరంగా జరిగే  అఖండ శివ భజనలు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున (24.11.2022) ముగియనున్నాయి. భజనలలో శివప్రణవ పంచాక్షరి మంత్రమైన “ఓం నమ:శివాయ” భజించబడుతోంది.

భజన ప్రారంభంలో ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, వేదపండితులు సంకల్పం పఠించారు. ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, సమృద్ధిగా పాడి లభించాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పారు.

తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేసారు. అనంతరం కంకణపూజజరిగింది.ఈ పూజాదికాల అనంతరం భజన భక్తులు కంకణాలను ధరించారు. కంకణధారణ తరువాత అఖండ శివభజనలు ప్రారంభమయ్యాయి. ఈ భజనలలో కర్నూలు జిల్లాకు చెందిన మూడు భజన బృందాలకు,  కర్ణాటకకు చెందిన మూడు భజన బృందాలకు అవకాశం కల్పించారు. శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి, కర్నూలు (26.10.2022 నుండి 2.11.2022), శ్రీ చెన్నకేశవ నాటక కళాభజన మండలి, కర్నూలు (2.11.2022 నుండి 9.11.2022), శ్రీ మల్లికార్జున భజన సంఘం, సుంకేశ్వరాహాల్,  శ్రీ మౌళీ బసవేశ్వర భజన సంఘ్,గోపనదేవరహళ్ళి, రాయచూర్ జిల్లా (09.11.2022 నుండి 16.11.2022), శ్రీ ప్రభులింగ సేవా సంఘ్ , గోపనదేవరహళ్ళి,రాయచూర్ (16.11.2022 నుండి 24.11.2022), శ్రీ గంగా భవాని మాత దేవాలయం కమిటీ, కర్నూలు జిల్లా ( 16.11.2022 నుండి 24.11.2022) వారు భజనలను చేయనున్నారు.

print

Post Comment

You May Have Missed