
శ్రీశైల దేవస్థానం:శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థమై వచ్చిన భక్తులు పోగొట్టుకున్న బంగారు కంకణాన్ని ఈ రోజు (16.12.2021) న దేవస్థానం అధికారులు తిరిగి అందించారు.
ఈ రోజు (16.12.2021) ఉదయం గుంటూరు నుంచి వచ్చిన శ్రీనివాసరావు, వారి కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఉచిత దర్శన 9వ కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు.
కంపార్టుమెంట్ తెరిచిన తరువాత దర్శనానికి వెళ్లే సమయంలో వారు బంగారు కంకణాన్ని పోగొట్టుకున్న విషయం తెలుసుకుని ఈ విషయాన్ని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహారెడ్డికి తెలిపారు. అధికారి వెంటనే సీసీ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకుని బంగారు కంకణం ఎలా పోయింది? దానిని ఎవరు తీసుకున్నారు మొదలైన విషయాలను సిసి కెమెరా ద్వారా తెలుసుకొని, ఆ కంకణాన్ని తీసుకున్నవారిని గుర్తించి అత్యంత చాకచక్యంగా వెంటనే దొంగిలించినవారి వద్ద నుంచి కంకణాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు అందించారు.
దాతలు మాట్లాడుతూ 95వేల రూపాయల విలువైన కంకణం తిరిగి తమకు అప్పగించిన దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.