జగనన్న తోడు పథకం కింద 30 వేల 729 మంది లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.30.73 కోట్లు జమ – జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్
కర్నూలు, జూన్ 8: జిల్లాలో జగనన్న తోడు పథకం కింద రెండవ విడత లో 30 వేల 729 మంది లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.30.73 కోట్లు జమ అయిందని జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్ తెలిపారు..
మంగళవారం జగనన్న తోడు పథకం కింద రెండవ విడతలో చిరు వ్యాపారుల ఉపాధికి ఊతంగా రూ.370 కోట్ల వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి
లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశారు..
కలెక్టర్ మాట్లాడుతూ , కర్నూలు జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా 10 వేల మందికి రూ.10 కోట్లు, డి ఆర్ డి ఎ – వై కె పి ద్వారా 20729 మందికి రూ.20.73 కోట్లు, మొత్తం 30 వేల 729 మందికి రూ.30.73 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ అయిందన్నారు..
చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తి దారులకు జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల రూపాయలు చొప్పున వడ్డీ లేకుండా ఆర్థిక సహాయం మంజూరు చేసిందని తెలిపారు.. అనంతరం లబ్దిదారులకు మెగా చెక్కును అందజేశారు..
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా. మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం)ఎం. కె.వి.శ్రీనివాసులు, డి ఆర్ డి ఎ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశు లు, ఏపిడి శ్రీధర్ రెడ్డి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శిరీష ,KDCC బ్యాంక్ సీఈవో రామాంజనేయులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు..
Post Comment