శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర దేవాదాయశాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్ పరిశీలించారు.
సర్వ దర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం , క్యూలైన్లు, పాగాలంకరణ ఏర్పాట్లు, కల్యాణోత్సవ ఏర్పాట్లు మొదలైనవాటిని కార్యదర్శి పరిశీలించారు.
ఈ సందర్భంగా వినయ్ చంద్ మాట్లాడుతూ భక్తుల రద్దీకి తగినట్లుగా ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు. క్యూలైన్ల నిర్వహణ పూర్తి ప్రణాళికబద్దంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారులు నిరంతరం క్యూలైన్ల నిర్వహణను పరిశీలిస్తుండాలన్నారు.క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు విధంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూకాంప్లెక్స్ లో వేచివుండే భక్తులకు మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు క్రమం తప్పకుండా అందిస్తుండాలన్నారు. ముఖ్యంగా క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాటలు లేకుండా , తగు విధంగా, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా క్యూకాంప్లెక్సులో ప్రత్యేకంగా ప్రథమచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు వినయ్ . ఈ కేంద్రంలో ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రథమచికిత్స కేంద్రం వద్ద నిరంతరం వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. క్యూలైన్లలో తగినంత మేరకు లైటింగు ఏర్పాట్లు ఉండాలన్నారు.
క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవిధంగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. ముఖ్యంగా చెత్తచెదారాలు ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అన్ని శౌచాలయాలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. శౌచాలయాల వద్ద నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు శౌచాలయాల శుభ్రతను పర్యవేక్షిస్తుండాలన్నారు.
క్షేత్రపరిధిలో అవసరమైన అన్నిచోట్ల కూడా సమాచార బోర్డులు, సూచిక బోర్డులు అధికసంఖ్యలో ఉండాలన్నారు.
ఈ ఏర్పాట్ల పరిశీలనలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఎడిటర్ డా. సి . అనిల్ కుమార్ , ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.