నంద్యాల జిల్లా:
*జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు
*రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమాన విధింపు
నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు “రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు” నిర్వహించారు.
👉ఈ సందర్భంలో నంద్యాల జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పట్టణ/గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యమైన ప్రాంతాలలో, కూడళ్లలో ప్రజలతో పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు.
👉నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాష శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం మోటార్ సైకల్ పై వచ్చే భక్తులు రోడ్డు ప్రమాదలను నివారించేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ,వేగం తగ్గించి వాహనాన్ని నడపాలని, ముఖ్యంగా ఘాట్ రోడ్డు మలుపులు వద్ద ముందు వాహనాన్ని ఎట్టి పరిస్థులల్లో ఓవర్ టేక్ చెయ్యరాదని అవగాహన కల్పించారు.
👉వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది.
👉మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
👉ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సులు, వాహనాలకు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని , పరిమితికి మించి ప్రయాణికులను సరుకులను రవాణా చేయరాదు.
👉 మోటార్ సైకిల్లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు.
👉రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసు అధికారులు సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
