శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశాలు
• కైలాస ద్వారం వద్ద మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి
• అధికారులకు దిశానిర్దేశం
ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు అవుతున్నాయి.
ఇందులో భాగంగా ఈ రోజు 31న ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు దేవస్థానం ఇంజనీరింగ్ , అధికారులతో కలిసి కైలాసద్వారం, హాటకేశ్వరం, ఫాలధార – పంచధార ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు ,కార్యనిర్వహణాధికారి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ముందుగా కైలాస ద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా వేసిన తాత్కాలిక చలువ పందిర్లను (తాత్కాలిక షెడ్డు) పరిశీలించారు. తరువాత ఉత్సవాల సందర్భంగా ఈ షెడ్లకు మంచినీటి వసతి, తాత్కాలిక విద్యుద్ధీకరణ మొదలైన ఏర్పాట్లను చేయాలన్నారు.
కైలాసద్వారం వద్ద , భీమునికొలను మెట్ల మార్గంలో నిరంతరం మంచినీటి సరఫరా జరుగుతుండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కైలాసద్వారం వద్ద 20వేల లీటర్ల సామర్థ్యపు శాశ్వత మంచినీటి ట్యాంకు (ఆర్.సి.సి ట్యాంకు)నకు నిరంతరం మంచినీటిని సరఫరా జరుగుతుండాలన్నారు..
అదేవిధంగా కైలాసద్వారం వద్ద గతంలో వలెనే 5వేల లీటర్ల సామర్థ్యం గల మరో 8 సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను మార్గములో 1000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను కనీసం 6చోట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కైలాసద్వారం వద్ద మొత్తం 60వేల లీటర్లు నీరు వుండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం కైలాసద్వారం దగ్గర మరియు కైలాసద్వారం – హటకేశ్వరం వద్ద భక్తులు అన్నదానం చేసే ప్రదేశాలను పరిశీలించారు.
అన్నదానం చేస్తున్న భక్తబృందాలు, స్వచ్ఛందసేవాసంస్థలకు దేవస్థానం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో కైలాసద్వారం వద్ద ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలిబాటతో వచ్చే భక్తులు ప్రధానంగా కాలిబొబ్బలు, ఒళ్లునొప్పులు మొదలైన ఇబ్బందులతో బాధపడుతుంటారని, ఈ సమస్యలకు సంబంధించిన మాత్రలు, పూతమందులు (ఆయింట్మెంట్) మొదలైనవి అందుబాటులో వుంచాలన్నారు.
అదేవిధంగా కైలాసద్వారం మరియు పరిసరాలను, భీమునికొలను మెట్ల ప్రారంభ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
ముఖ్యంగా కైలాసద్వారం వద్ద జనరేటర్ ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తరువాత కార్యనిర్వహణాధికారివారు హాటకేశ్వర ప్రాంతాన్ని పరిశీలించారు.
హాటకేశ్వరాలయం వద్ద దేవస్థానం నిర్మిస్తున్న నీటిసంపు నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సంపు నీటినిల్వ సామర్థ్యం 3.90 లక్షల లీటర్లు. ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే నిర్మాణంలో పూర్తి నాణ్యతను పాటించాలన్నారు.
తరువాత హాటకేశ్వరం వద్ద దేవస్థానం నిర్మిస్తున్న జల్లు స్నానాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు యం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి.వి. సుబ్బారెడ్డి, పి. చంద్రశేఖరశాస్త్రి, అసిస్టెంట్ ఇంజనీర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం. పరమేశుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఎడిటర్ డా. సి . అనిల్ కుమార్
ఆర్. బాలాజీ కూడా పాల్గొన్నారు.
ఆర్. బాలాజీ కూడా పాల్గొన్నారు.