పరోక్షసేవగా బయలు వీరభద్రస్వామివారి విశేషపూజ -సేవలో పాల్గొన్న 451 మంది భక్తులు

శ్రీశైల దేవస్థానం: ఆర్జిత పరోక్షసేవగా  శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలువీరభద్రస్వామివారికి  ఈ రోజు (09.06.2021) న  విశేషార్చన జరిగింది.

మొత్తం 451 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుమును చెల్లించి ఈ పరోక్షసేవలో  పాల్గొన్నారు.

ఒకే పరోక్షసేవలో ఇంత  ఎక్కువ మంది భక్తులు పాల్గొనడం ఇదే  మొదటిసారి కావడం విశేషం.

 కార్యనిర్వహణాధికారి  కే ఎస్.రామరావు  మాట్లాడుతూ గత సంవత్సరం  ఏప్రియల్ మాసంలో  ప్రారంభించిన పరోక్షసేవను దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రస్తుతం మరింతగా విస్తరింపజేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయలువీరభద్రస్వామి పరోక్ష సేవకు భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందన్నారు.

 శ్రీశైలక్షేత్ర సంప్రదాయాలలో బయలువీరభద్రస్వామివారికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. శ్రీశైలక్షేత్రానికి బయలు వీరభద్రస్వామివారే     క్షేత్ర  పాలకుడని పేర్కొన్నారు.బయలువీరభద్రస్వామివారికి నిత్యపూజాదికాలతో పాటు లోకకల్యాణార్థం దేవస్థానం ప్రతి మంగళవారం,  అమావాస్య రోజులలో విశేషపూజాదికాలను నిర్వహిస్తున్నట్లు  పేర్కొన్నారు.

ప్రస్తుతం అమావాస్య నాడు నిర్వహించే పూజలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం మొట్టమొదటిసారిగా కల్పించడం జరిగిందన్నారు. ప్రతీనెలలో కూడా అమావాస్యరోజున ప్రదోషకాలములో భక్తులు ఈ పూజాదికాలను పరోక్షసేవ ద్వారా భక్తులు జరిపించుకోవచ్చునని అన్నారు. .

కాగా ఈ రోజు సాయంకాలం గం. 5.30 నుండి ఈ విశేషపూజ ప్రారంభమైంది.

ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యాను కూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కాగా వచ్చే నెల నుండి డిసెంబరు వరకు ఈ పూజలు నిర్వహించు తేదీలు : క్రమసంఖ్య నెల విశేషపూజ జరిగే .తేది

జూలై | 9వ తేదీ

ఆగస్టు 8వ తేదీ

సెప్టెంబరు 7వ తేదీ

అక్టోబరు 5వ తేదీ 

నవంబరు 4వ తేదీ

డిసెంబరు 3వ తేదీ

శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకువీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవలను ప్రారంభించింది.

గణపతి హోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమం, చండీహోమం, స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారికుంకుమార్చన, శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామికల్యాణం, శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల కల్యాణం,స్వామిఅమ్మవార్ల ఏకాంతసేవ , వేదాశీర్వచనం వంటి సేవలను ఈ పరోక్ష పద్దతిలో జరిపించుకోవచ్చు.

ప్రస్తుతం అమావాస్యనాడు బయలు వీరభద్రస్వామిపూజను కూడా పరోక్షసేవలో చేరింది.

ఈ ఆర్జిత సేవలలో భక్తులు ఆన్లైన్ ద్వారా ఒక్కొక్కపూజకు రూ.1,116/-లను సేవా రుసుముగా చెల్లించి, ఏ సేవనైనా చేయించుకోవచ్చు..

భక్తులు సేవారుసుమును https : || tms.ap.gov.in లేదా www.srisailadevasthanam.org ద్వా రా చెల్లింపు చేయవచ్చు.

అదేవిధంగా క్యూ.ఆర్. కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, బి. హెచ్.ఐ.ఎమ్, పే.టి.ఎమ్ ద్వారా కూడా సేవా రుసుమును చెల్లించవచ్చు.

స్వామివారి రుద్రాభిషేకం,  అమ్మవారి కుంకుమార్చన మినహా మిగిలిన సేవలను శ్రీశైలటీవి , యూ ట్యూబ్ ద్వారా దేవస్థానం ప్రత్యక్ష ప్రసారాలను చేస్తోంది.

సేవాకర్తలు ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైన వాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతున్నారు.

సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.  భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.

ఇతర వివరములకు దేవస్థాన సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351/ 52 | 53 / 54/ 55/56 లను సంప్రదించవచ్చు.

print

Post Comment

You May Have Missed