×

శ్రీశైల దేవస్థానానికి బ్యాటరీ వాహనం విరాళం

శ్రీశైల దేవస్థానానికి బ్యాటరీ వాహనం విరాళం

శ్రీశైల దేవస్థానం: దేవస్థానానికి  మంగళవారం  శ్రీమతి మున్నంగి సామ్రాజ్యం, కొత్తూరు గ్రామం, తడపల్లి మండలం, గుంటూరు జిల్లా వారు  బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందజేశారు.  తమ భర్త కీర్తిశేషులు  శంకరరెడ్డి జ్ఞాపకార్థం ఈ వాహనాన్ని అందజేసినట్లుగా దాత  పేర్కొన్నారు. దీని విలువ రూ. 6 లక్షలని తెలియజేశారు.వాహనాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వి.రామకృష్ణ కు అందజేశారు. ఈ సందర్భంగా బయలు వీరభద్రస్వామి ఆలయం వద్ద వాహనానికి పూజాదికాలు చేసారు.

print

Post Comment

You May Have Missed