కోవిడ్-19 నివారణలో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హైదరాబాద్ జోన్ ఉద్యోగుల వేతనాన్ని రూ. 3,00,000/-ల చెక్కును తెలంగాణ సి.యం. సహాయ నిధికి గాను గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు జోన ల్ మేనేజర్ దివిశ్ దినకర్ అందచేశారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 178 మంది ఉద్యోగుల రెండు రోజుల వేతనాన్ని సి.యం. సహాయ నిధికి అందచేశామని జోనల్ మేనేజర్ తెలిపారు.