శ్రీశైల దేవస్థానం: దేవాదాయశాఖ నిబంధనలను అనుసరించి శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడం మొదలైనవాటిని పూర్తిగా నిషేధించారు.
అదేవిధంగా అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను , అన్యమతానికి సంబంధించిన ఫోటోలను కలిగివున్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతించబడవు.
క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ అన్యమత ప్రచారాలకు, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే.
నిబంధనలను ఉల్లంఘించి, విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టం ప్రకారం తగు చర్యలు వుంటాయని దేవస్థానం తెలిపింది.