
*జంధ్యాల శ్రీకృష్ణ *
మచిలీపట్నం:మచిలీపట్నం బచ్చుపేట శ్రీ భ్రమరాంబా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభ మయింది. ఈ నెల 19 వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 16 న రాత్రి 7 గం. శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 19 న రాత్రి 7 గం.లకు శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.