×

అందరి కృషితోనే స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమం

అందరి కృషితోనే స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమం

 శ్రీశైల దేవస్థానం:అందరి సమిష్టి కృషితోనే స్వచ్ఛ శ్రీశైలాన్ని సాధించగలమని  ప్రొఫెసర్ డా. పి. శరవణన్ అన్నారు.  శ్రీశైలంలోని ఏపి టూరిజం హరిత హోటల్ లో  గురువారం  ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు స్వచ్ఛతా యాక్షన్ ప్లాన్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డా. పి. శరవణన్, నెల్లూరు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత , ప్లాస్టిక్ వాడక నిషేధం మొదలైన అంశాలపై అవగాహన కల్పించారు.క్షేత్రంలో పారిశుద్ధ్యాన్ని పాటించడమనేది నిరంతర ప్రక్రియ అని, ఏరోజుకారోజు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సి ఉందన్నారు.స్వచ్ఛ శ్రీశైల సాధనకు దేవస్థానం చేపట్టిన చర్యలకు స్థానిక సత్రాల యాజమాన్యాల వారు, హోటళ్ల నిర్వహకులు, వ్యాపారులు, స్థానికులతో పాటు భక్తులందరు కూడా సహకరించాలన్నారు. అందరి సమిష్టి కృషితోనే స్వచ్ఛ శ్రీశైలాన్ని సాధించగలమన్నారు.స్థానిక హోటళ్ల నిర్వాహకులు, దుకాణాల వారు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని స్వచ్ఛందంగా నిరోధించాలన్నారు.

ఈ కార్యక్రమం లో ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, శానిటేషన్ సిబ్బంది, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed