
కర్నూలు, జులై 23 :-పంట మార్పిడిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి అధిక దిగుబడినిచ్చే పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమల తదితర శాఖల అధికారులతో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ సలహా మండలి రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక – రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి :-
వ్యవసాయ సలహా మండలి రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక అని ఖచ్చితంగా సమావేశాలు నిర్వహించుకొని, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేసి అన్ని రకాలుగా రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించేలా అందరం కలిసి పని చేద్దాం అన్నారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జిలుగులను ఎక్కువశాతం కేటాయించండి – ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి :-
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ తదితర మండలాల్లో అధిక సంఖ్యలో వరి పంట సాగు చేస్తారని, అందుకు జిలుగులు కొరత రాకుండా ఉండేందుకు అధిక సంఖ్యలో జిలుగులను కేటాయించాలన్నారు. వ్యవసాయ సాగుకు సంబంధించి పరికరాలను సబ్సిడీతో ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ సలహామండలి మీటింగ్ పెట్టుకొని రైతులకు ఏం అవసరమో వాటిపై ప్రణాళికలు సిద్ధం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
రైతులకు అవగాహన కల్పించండి
బావుల దగ్గర వరి పంట సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు ఆదాయం వచ్చే వాటి పై మొగ్గు చూపేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్ బి కె, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ఖచ్చితంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అగ్రికల్చర్ జెడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అగ్రికల్చర్ జెడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో వ్యవసాయ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకొని తొందరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసుకొని, భవన నిర్మాణాలు పూర్తి అయిన వెంటనే రైతు భరోసా కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు కావలసినంత ఎరువులను సిద్ధం చేసుకోవాలన్నారు. పంట నమోదు ప్రక్రియ చాలా అధ్వానంగా జరుగుతుందని, ఇప్పటివరకు 700 మంది మాత్రమే పంట నమోదు చేసుకున్నట్లు రసీదు ఇచ్చారని, పంట నమోదు ప్రక్రియను 100% పూర్తి చేసేలా వేగవంతం చేయాలన్నారు.
పంట వేసిన వెంటనే ఈ క్రాప్ బుకింగ్ ఖచ్చితంగా జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ జెడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పంట నమోదు చేసిన వెంటనే ప్రతి రైతుకు తప్పకుండా రసీదు ఇవ్వాలన్నారు. వర్షాకాలం సీజన్ కనుక రైతులు తమ పొలాలలో విద్యుత్ సంబంధించి పనులు స్వయంగా చేసుకుంటూ ఉంటారని అలా చేసుకోకూడదని…విద్యుత్తు సమస్య తలెత్తితే వెంటనే గ్రామ సచివాలయంలోని ఎనర్జీ అసిస్టెంట్ ను తెలియజేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రి సమయంలో పొలాల దగ్గరికి వెళ్లి పాము కాటుకు గురవుతున్నారని, రాత్రి సమయంలో పొలాల గట్ల వద్ద తిరిగే సమయంలో జాగ్రత్తలు పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఒక వేళ రైతు పాముకాటుకు గురైతే వైద్య అధికారులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు సకాలంలో వాక్సినేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ జెడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు కొరత లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టండి – జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి :-
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, వర్షాకాలం సీజన్ కనుక పంటలకు చీడపీడలు రాకుండా ఉండేందుకు అవసరమైన మందులను, ఎరువులను రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలన్నారు. పంట వేసిన 20 రోజుల్లోనే పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫర్టిలైజర్స్ లో కాంప్లెక్స్ ఎరువుల కొరత ఉందని రైతులు తమ దృష్టికి తీసుకు వస్తున్నారని, కాంప్లెక్స్ ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉల్లి పంటలు జిల్లాలో బాగా సాగు చేస్తారని, ఉల్లి పంటలు స్టోరేజ్ చేసుకునే దానికోసం స్టోరేజ్ షెడ్ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నష్టపోయిన రైతాంగానికి విత్తనాలు వెంటనే సరఫరా చేయండి – నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ :-
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొత్తపల్లి, పాములపాడు తదితర మండలాల్లో పత్తి, మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోయారని, ఎకరాకు 60 వేల రూపాయల నష్టం వచ్చిందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన పత్తి తదితర విత్తనాలు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
అర్హులైన కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి – జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ్ సుందర్ రెడ్డి :-
జిల్లాలోని అర్హులైన కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. బోర్ల కింద పండించే వరి పంటలకి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ 100% జరిగేలా చూడాలన్నారు. పంట మార్పిడి పద్ధతి కూడా ఖచ్చితంగా పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలను వెంటనే సేకరించాలని జాయింట్ కలెక్టర్ వ్యవసాయ అధికారులకు ఆదేశించారు.
జూమ్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, అగ్రికల్చర్ జెడి ఉమా మహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ ఎం బి రమేష్, ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి, పట్టు పరిశ్రమ శాఖ డి డి పరమేశ్వరి, ఆర్ ఎ ఆర్ ఎస్ ఏడి ఆర్, సైంటిస్ట్ డి.లక్ష్మి కళ్యాణి, నాబార్డు ఏజీఎం పార్థవ్, ఎల్ డి ఎం వెంకట్ నారాయణ, డి సి సి బి సిఈ ఓ రామాంజనేయులు, వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక శాఖల ఏడి లు, డిడిలు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న కాలనీలలో నవరత్నాల పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరగాలి :-
పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని…ఆ దిశగా జిల్లాలో పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరగాలని హౌసింగ్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్ ఆదేశించారు
శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం తదితర పనుల పై డ్వామా పిడి, హౌసింగ్ పిడి, ఈఈలు, డిఈలు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ ఈ, పీహెచ్ ఈ ఈఈ, డిఈలతో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
గూగుల్ మీట్ లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, హౌసింగ్ పిడి వెంకట నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సిహెచ్ విద్యాసాగర్, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ, హౌసింగ్ ఈఈలు, డిఈలు, తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ లేవుట్ ల్లో ప్రిపరేటరీ వర్కులన్ని యుద్ధ ప్రాతిపదికన సత్వరమే వంద శాతం పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. హౌసింగ్ ఏఈలందరు కూడా ఇంటి నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా ఉండేందుకు ఇసుక indent రైజ్ చేయండి. మ్యాన్ పవర్, ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి ఇటుకలు, సిమెంట్, స్టీలు సమకూర్చి లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సెప్టెంబర్ 15 కల్లా ఇళ్ల నిర్మాణాలు పునాది స్థాయికి తీసుకొచ్చేందుకు హౌసింగ్ అధికారులు చర్యలు చేపడుతూ ముమ్మరంగా ఇళ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు.
నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి….
జిల్లాలో జరుగుతున్న నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి నాడు-నేడు పనులపై ఎం ఈ ఓ లు, డిప్యూటీ డి ఈ ఓ లు, ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ ఆగస్టు నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేయడం జరుగుతుందని నాడు-నేడు పనులకు సంబంధించిన అధికారులు అందరూ బాధ్యతగా పనిచేసి ఈ నెల చివరి కల్లా పనులు పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు బాధ్యతగా తీసుకొని పనులు పూర్తి చేయాలన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటె వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలన్నారు. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఎస్ఎస్ఏ పిఓ వేణుగోపాల్ మాట్లాడుతూ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్,కు సంబంధించి నిధులు పుష్కలంగా ఉన్నాయని వారం రోజుల లోపల ఈ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. పెయింటింగ్ వర్కులు వాల్ ఆర్ట్స్ క్వాలిటీతో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈలు, డి ఈ లు, డిప్యూటీ డీఈవో లు, ఎం ఈ వో లు, తదితరులు పాల్గొన్నారు.