వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు విద్యార్థుల సర్వోన్నతికి  ఉపయోగం

 శ్రీశైల దేవస్థానం:‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం లో భాగంగా  దేవస్థానం స్థానిక జిల్లాపరిషత్ పాఠశాల  విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. . ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ  మాట్లాడుతూ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించడం వలన రచనపట్ల అవగాహన కలుగుతుందని, విషయ జ్ఞానం కలుగుతుందని, పోటీతత్త్వం పెరుగుతుందని అన్నారు.

ఈ పోటీలలో ‘మన రోజువారి జీవితంలో పారిశుద్ధ్య ప్రాముఖ్యత’, ‘స్వచ్ఛత హీ సేవా’ భారత దేశములో వినూత్న మార్పు’ అనే అంశాల మీద వ్యాసరచన, ‘పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో  విద్యార్థుల పాత్ర’, ‘స్వచ్ఛత హీ సేవా’ . – సామాజిక చైతన్యం’ అనే అంశాల మీద వక్తృత్వం, , క్విజ్ పోటీలు జరిగాయి.

 ప్రధానోపాధ్యాయులు కె. వెంకటరమణ మాట్లాడుతూ దేవస్థానం వారు పాఠశాల విద్యార్థులకు ఇలాంటి పోటీలు నిర్వహించడం హర్షించదగిన విషయం అని, విద్యార్థుల సర్వోన్నతికి  ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు.

అనంతరం కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలలో 6,7,8,9,10 తరగతుల నుంచి జూనియర్, సీనియర్ విభాగాల ద్వారా మొత్తం 80 మందికి పైగా పాల్గొన్నారు. ఆయా విభాగాలలో మొత్తం విజేతలు అయిన 53 మందికి బహుమతులు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు. జిల్లా పరిషత్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె. వెంకటరమణ, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటి చైర్మన్ శ్రీమతి డి. వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ టి. వెంకటశివుడు మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed