శ్రీశైల దేవస్థానం:శ్రావణ మాసోత్సవాల సందర్భంగా దేవస్థానం ఏర్పాటు చేసిన డా.బులుసు అపర్ణ
, భీమడోలు, పశ్చిమగోదావరి జిల్లా వారి ద్విశతావధానం కార్యక్రమం ఆదివారం తో ముగిసింది.
“అవధాన కవితా నీరాజనం” పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఈ నెల 14న ప్రారంభమైనది. ఆలయమాడ వీధిలోని నిత్యకళారాధన వేదికపై కార్యక్రమం నిర్వహించారు.
ప్రతీరోజు ఉదయం గం.9.00ల నుంచి మధ్యాహ్నం గం.1.00ల వరకు తిరిగి మధ్యాహ్నం గం. 2.30గంటల నుంచి సాయంత్రం గం.6.30ల వరకు ఈ ద్విశతావధాన కార్యక్రమం నిర్వహించారు. అయిదు రోజులపాటు జరిగిన ఈ ద్విశతావధాన కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మందికిపైగా కవి పండితులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు.
మొదటి రోజు (14.08.2024) ప్రారంభ సభకు కళారత్న గండ్లూరి దత్తాత్రేయశర్మ, ద్రోణాచలం, నంద్యాల జిల్లా వారు విశిష్ట అతిథిగా విచ్చేశారు.
ఈ రోజు ముగింపు సమావేశానికి ఆచార్య జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి, వైసాఛాన్సలర్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి వారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీ వేత్త డా. పేరి రవికుమార్, విశాఖపట్నం సంధానకర్తగా వ్యవహరించారు.
కాగా 5 రోజులపాటు జరిగిన ఈ ద్విశతావధానం కార్యక్రమంలో డా.బులుసు అపర్ణ 50 సమస్యలు, 50 దత్తపదులు, 50 వర్ణాంశాలు, 30 ఆశువులు, 20 ఘంటావధానాలను పూరించారు. అదేవిధంగా ముగింపు సభలో జరిగిన ధారణ కార్యక్రమం లో 150 అంశాలను అనగా 50 సమస్యలు, 50 దత్తపదులు, 50 వర్ణాంశాలను ధారణ చేశారు
ముగింపులో అవధానిగారికి, విశిష్ట అతిథులకు, పృచ్ఛకులుగా వ్యవహరించిన కవిపండితులందరికీ వేదాశీర్వచనముతో శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు.
ముగింపు కార్యక్రమం లో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, ప్రజా సంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకురాలు గిరిజామణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.