శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా శుక్రవారం బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ వారిచే దేవస్థానం ‘ అష్టావధానం’ కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఈ నాటి కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలను బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ, కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, అర్చకులు, అధికారులు చేశారు.బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ అష్టావధానం ప్రారంభించారు. డా. పి.టి.జి.వి. రంగాచార్య, రాష్ట్రపతి పురస్కార గ్రహీత సభా సమన్వయం , పృచ్ఛకులుగా వ్యవహరిస్తున్నారు.
దత్తపదికి బ్రహ్మశ్రీ పశర్లపాటి బంగారయ్యశర్మ వ్యవహరిస్తుండగా, సమస్య పురాణానికి మాడుగుల శివశ్రీ శర్మ అవధాని, నిషిద్ధాక్షరికి చింతా రామకృష్ణరావు, వర్ణనకు, సురభి శంకరశర్మఅవధాని, అశువుకు పృచ్ఛకులుగా వ్యవహరిస్తున్నారు.
దత్తాత్రేయశర్మ అప్రస్తుతపు ప్రసంగాన్ని చేయనున్నారు. దేవస్థానం ప్రచురిస్తున్న శ్రీశైలప్రభ మాసపత్రిక సంపాదకులు డా. సి. అనిల్ కుమార్ ప్రత్యేక అంశంపై పృచ్ఛకులుగా వ్యవహరిస్తున్నారు.